Movies

హరితేజ గురించి కొన్ని నమ్మలేని నిజాలు… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అప్పటికే పలు సీరియల్స్‌, సినిమాల్లోకి కూడా నటించిన హరితేజ తెలుగు వారికి బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎక్కువ పరిచయమైంది. ప్రస్తుతం హరితేజ సినిమాల్లో నటిస్తూనే..పలు టీవీ షోలకు యాంకరింగ్ కూడా చేస్తోంది. నితిన్ హీరోగా సమంత హీరోయిన్‌గా 2016లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అఆ’ సినిమాలో మంగమ్మ పాత్ర హరితేజకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు కరోనా మహమ్మారి తో విధించిన లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. అందులో భాగంగా కొందరు సెలెబ్రీటీలు కరోనా పై అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ చేస్తూ, మరోపక్క సోషల్ మీడియాలో వీడియోలు చిట్ చాట్లతో టైంపాస్ చేస్తున్నారు.

హరితేజ కూడా తాజాగా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ, తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ సందర్బంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాదానమిచ్చింది. ఈ సందర్భంగా నెటిజన్ ఓ ప్రశ్న అడుగుతూ.. మీ వయసు ఎంతో చెప్పగలరా? అని ప్రశ్నించాడు. హరితేజ ఏమాత్రం తొట్రు పడకుండా స్పందిస్తూ ‘నా వయస్సు గురించి చెప్పినా మీరు నమ్మరు.. నమ్మినా వినరు.. విన్నా అర్థం చేసుకోరు. నిజాలు ఎప్పుడూ నిష్ఠూరంగా ఉంటాయి. అయినా చెబుతా అంటూ.. తన బర్త్ డేట్‌ను 24-02-1992 అని చెప్పింది. దీంతో మీరు ఇంత చిన్న వారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు .

అంతటితో ఆగకుండా మరో నెటిజన్ వేసిన ప్రశ్నకు హరితేజ ఏమాత్రం కంగారుపడలేదు. `హిట్` సినిమాలో షీలా పాత్రలో నటించిన మీరు ఆ సినిమాలో చూపించినట్లు నిజంగా సిగరెట్ కాల్చారా?` అని అడగగా.. హరితేజ సమాదానమిస్తూ.. ‘అవును, ఆ సీన్ కోసం నిజంగానే సిగరెట్ కాల్చా’అని చెప్పింది. సినిమాలో షీలా పాత్ర అలా ప్రవర్తించాలి. అందుకే ఆ పాత్ర డిమాండ్ మేరకు అలా చేయక తప్పలేదు’అని చెప్పింది. ఇక హరితేజ సినిమాల విషయానికి వస్తే వరుసగా సినిమాలు చేస్తూ అదరగొడుతోంది. మరోవైపు టీవీల్లో షోలకు యాంకరింగ్ చేస్తూ హవా సాగిస్తోంది.