3 దశాబ్దాల ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ఎలా పుట్టింది? నమ్మలేని నిజాలు
టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి అందులో మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించారు. అప్పటి వరకు ఉన్న అన్నిరికార్డులను ఈ సినిమా తిరగ రాసింది. ఈ సినిమా మే 9వ తేదితో 30 యేళ్లు కంప్లీట్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మూడు తెలియని విషయాలను అభిమానులతో పంచుకోనున్నట్టు నిర్మాత అశ్వినీదత్ ట్విట్టర్‌లో తెలిపారు. అందులో మొదటి స్టోరీని నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్‌తో విడుదల చేసారు. తరాలు మారినా.. ఎవర్ గ్రీన్ ఉండే బ్లాక్ బస్టర్ సినిమా లిస్టులో ఉండే మొదటి సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’అంటూ నాని వివరించాడు. ఓ సినిమాను చూసే విధానాన్ని మార్చిన ఈ చిత్ర కథ ఎలా పుట్టింది అనే దానిపై నాని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.
‘అశ్వినీదత్ కి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ‘జగదేకవీరుని కథ’ లాంటి ఫాంటసీ కథ చిరంజీవితో చేయాలనే కోరిక అశ్విని దత్ లో ఉండేదట. అది కూడా తను ఎంతో ప్రేమగా బావ అని పిలిచే రాఘవేంద్రరావు మాత్రమే తీయగలరనే గట్టి నమ్మకం ఉండేదట.నాగార్జున, శ్రీదేవిలతో ‘ఆఖరి పోరాటం’ తర్వాత చిరంజీవితో సినిమాలకున్నారు. ఈ సందర్భంగా దత్తుకు క్లోజ్ ఫ్రెండ్ అయిన కో డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తిని, రాఘవేంద్రరావుతో కలిపి తిరుపతికి పంపారు. సరిగ్గా తిరుమల కొండపై ఉండగా అశ్వినీదత్ మనసు తెలిసిన శ్రీనివాస చక్రవర్తి దేవకన్య భూమిపైకి వచ్చినపుడు ఆమె ఉంగరం పోగుట్టుకుంటుంది. అది హీరోకు దొరుకుతుంది. అని కొంచెం ఊహాజనితంగా ఈ కథ ముఖ్యపాయింట్‌ను చెప్పారు. అది రాఘవేంద్రరావుకు నచ్చింది.ఈ స్టోరీని అశ్వినీదత్ విని ఓకే చేసారు. ఆ తర్వాత మరి జగదేక వీరుడికి జోడిగా అతిలోకసుందరి ఎవరు ? అందరి మదిలో శ్రీదేవి పేరు వినిపించింది. ఆమె అప్పటికే వైజయంతి మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో కథానాయికగా నటించింది.
ఈ కథకు ఒక రూపం ఇవ్వడానికి రాఘవేంద్రరావు వైజయంతీ మూవీస్‌కు సంబంధించిన ఆఫీసులో అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న టాప్ రచయతలను కథా చర్చల్లో పాల్గొనేలా చేసారు.జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి, విజయంద్ర ప్రసాద్, క్రేజీ మోహన్ వంటి చాలా మంది రచయతలు కలిసి ఈ సినిమా కథకు ఓ రూపం తీసుకొచ్చారు. వారితో కలిసి చిరంజీవి కూడా కథా చర్చల్లో పాల్గొన్నారు. ఇక దేవకన్యగా అతిలోకసుందరి చూపిస్తున్నపుడు నేను కొంచెం మాసిన గడ్డంతో ఉంటే బాగుంటుంది కదా అనే సలహా కూడా ఇచ్చారట. దీంతో నార్మల్ ప్రేక్షకులు కథతో కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు.మరోవైపు శ్రీదేవి ఈ సినిమాలో తన కాస్ట్యూమ్స్‌కు తానే కుట్టించుకోవడం మొదలపెట్టారట. అలా అందరూ కలిసి ఈ చందమామ కథకు అందమైన రూపు ఇచ్చారు. అలా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ చిత్రం క్లాసిక్‌గా నిలిచిపోయింది. చరిత్రను సృష్టించిన ఈ సినిమా కథ అంతా ఈజీగా అయిపోయిందనుకుంటున్నారా ? లేదు మానవా.. చాలా స్టోరీ చాలా మిగిలే ఉంది.