Movies

రానా – మహీక.. ప్రేమ కథ ఎప్పుడు మొదలైంది?

రానా దగ్గుబాటి, మహీక బజాజ్‌.. త్వరలో వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కొద్ది రోజుల క్రితమే తమ మధ్య ప్రేమని ఇటు రానా, అటు మహీక అధికారికంగా వెల్లడించారు. అంతకు ముందు వరకు రానా ప్రేమలో వున్న సంగతి ఎవరికీ తెలియదు. అయితే, రానా – మహీక మధ్య ప్రేమ చాలా ఏళ్ళుగా కొనసాగుతోందట. ప్రస్తుతం ప్రచారంలో వున్న ఓ గాసిప్‌ ప్రకారం చూస్తే, వీరిద్దరి ప్రేమ బంధానికి దాదాపు పదేళ్ళ వయసుంటుందట. ఇది నిజమేనా.? అన్నదానిపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇదిలా వుంటే, ఓ బాలీవుడ్‌ పార్టీలో రానా – మహీక కలుసుకున్నారనీ, అక్కడే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించిందన్నది మరో గాసిప్‌ సారాంశం.

అసలు రానా, మహీక ఎప్పుడు తొలిసారిగా కలుసుకున్నారు.? పదేళ్ళ క్రితమే ప్రేమ చిగురిస్తే.. ఇన్నాళ్ళూ ఆ విషయం బయటకు పొక్కకుండా ఎలా జాగ్రత్తపడ్డారు.? అన్న విషయమై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ ప్రేమ కథకు సంబంధించి అతి త్వరలోనే రానా మరింత స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయట. కరోనా లాక్‌డౌన్‌ ముగిశాక, పెళ్ళి గురించిన విషయాలపై స్పష్టత వస్తుందని రానా తండ్రి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ చెబుతున్న విషయం విదితమే.