Health

ఎండలు ముదిరిపోతున్నాయి… ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

లిక్విడ్స్ తీసుకోవడం.. ఈ కాలంలో చెమట ద్వారా ఎక్కువ నీరు బయటికి వెళ్తుంది. కాబట్టి తగినంత నీరు తీసుకోవాలి. కేవలం నీరే కాదు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవాలి.

చన్నీటి స్నానం.. వేడినీరు కంటే చన్నీటితోనే స్నానం చేస్తేనే ఎంతో మంచిది. అలా చేస్తేనే చర్మం పొడిబారకుండా, పగుళ్లు రాకుండా ఉంటాయి. అదే విధంగా. మొటిమలు, చెమటకాయలు వంటి చర్మ సమస్యలు కూడా రావు.

ప్రయాణాలు: ఉదయం 10 దాటిందంటే ఎండలు ముదిరిపోతున్నాయి. కాబట్టి అత్యవసర సమయాల్లో తప్పితే ప్రయాణాలు చేయకూడదు. అదేవిధంగా.. గంట చొప్పున ఎంతోకొంత నీరు తాగాలి. వీటితో పాటు.. ప్రయణాలు తప్పదంటే బస్సు, ట్రైన్స్, ఆటోల్లో వెళ్లడం చేయాలి. గాలి కూడా తగిలేలా చూసుకోవాలి. బైక్స్ మీద వెళ్లకపోవడమే మంచిది.

చర్మ రక్షణ: బయటికి వెళ్లేముందు ఖచ్చితంగా సన్‌స్క్రీన్ లోషన్ రాయాలి. అదేవిధంగా.. నీరు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కళ్లకి ఇబ్బందులు కలగకుండా గాగూల్స్ వాడాలి. అదే విధంగా ముఖాన్ని కవర్ చేసుకునేలా స్కార్ప్, క్లాత్స్‌‌తో కట్టుకోవాలి.

దుస్తులు: కాటన్ దుస్తులు ధరించాలి. అవి కూడా వదులుగా, లేతరంగుల్లో ఉంటే మంచిది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."