Movies

హీరోయిన్స్ కి లక్కీ హీరో చంద్ర మోహన్ గురించి ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా ?

ఒకప్పుడు హీరోగా.. ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ కెరీర్ లో చంద్రమోహన్ అనేక హిట్లందుకున్నారు . రంగుల రాట్నంతో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్.. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకన్నారు. బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా చంద్రమోహన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఒకప్పటి హీరో.. తర్వాత కామెడీ హీరో.. ఆ తర్వాత టాలీవుడ్ ఫాదర్, బ్రదర్, అంకుల్.. కేరెక్టర్లన్నీ వేస్తూ, మొత్తంగా 54 ఏళ్ల నుంచీ తెలుగు సినిమాతో కలసి నడుస్తున్నాడు. చంద్ర మోహన్ సరసన హీరోయిన్ గా చేసిన వారి లక్కు తిరిగినట్టే. కట్ చేస్తే ఎక్కడికో వెళ్లేది వారి కెరీర్. అంతటి లక్కీ హ్యాండ్ . అందుకే చంద్ర మోహన్‌తో నటించిన తర్వాతే శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి వంటి ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా రాణించారు.

మొదట్లో కొత్త నీరు వంటి చిత్రాలతో సీరియస్ హీరోగా నటించిన చంద్రమోహన్ తర్వాత తన పంథా చేంజ్ చేసుకుని, బంగారు పిచుక వంటి సినిమాల నుంచీ ఆయనలోని కామెడీ యాక్టర్ బయటికొచ్చాడు. గంగ మంగ వంటి కొన్ని చిత్రాల్లో విలనిజం చూపించాడు. సినిమాలో తనది హీరో క్యారెక్టరా.. కాదా? అని కాకుండా వచ్చిన పాత్రకు తగిన న్యాయం చేయడమనే థియరీ పక్కాగా ఫాలో అయిపోయాడు. చంద్రమోహన్ నటించిన ‘ఓ సీత కథ’తో వేటూరి గీతరచయితగా పరిచయం కావడం విశేషం.గంధము పూయరుగా అనే పాట మీరు వినేవుంటారు. ఈ పాట శుభోదయం అనే సినిమాలోనిది. ఇందులో చంద్రమోహన్ చంద్రం అనే పాత్ర వేశారు చంద్ర మోహన్ నటుడిగా ఒక మూసకే పరిమితం కాలేదు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో రాణించాడు.

చంద్రమోహన్. పక్కింటి అమ్మాయి అనే సినిమా లో జయసుధ, ఎస్పీబీ, చక్రవర్తి యాక్ట్ చేసిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే ఓ పెద్ద హిట్. అందులో పాటలన్నీ సూపర్ హిట్. రెండు రెండ్లు ఆరు, జయమ్ము నిశ్చయమ్మురా వంటి సినిమాలతో కామెడీ హీరోగా టాలెంట్ చూపించిన చంద్రమోహన్ అల్లుడు గారు మూవీతో ఫుల్ టైం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాడు. తర్వాత వచ్చిన గులాబీతో తండ్రి పాత్రలకు షిఫ్ట్ అయిపోయి, అక్కడి నుంచీ వరుస సినిమాలు. నువ్వు నాకు నచ్చావ్, 7జీ బృందావన్ కాలనీ, అతనొక్కడే వంటి చిత్రాల్లో హీరో ఫాదర్ గా 100 పర్శెంట్ ఫిట్ అనిపించుకున్నారు. అతనొక్కడే చిత్రానికిగానూ చంద్రమోహన్ బెస్ట్ కేరెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డునందుకున్నారు. దూకుడు, యముడికి మొగుడు ఇలా చంద్రమోహన్ కెరీర్ నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా సరే, ఒకటీ అరా సందర్భాల్లో తప్పితే వివాదాస్పదమూ అవలేదు.మొత్తానికి సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చంద్ర మోహన్ 1945 మే 23న కృష్ణాజిల్లాలో పుట్టారు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ లో డిగ్రీ చేశారు. ప్రఖ్యాత దర్శకుడు కే విశ్వనాథ్ కి కజిన్ అవుతారాయన. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సిరిసిరి మువ్వ , సీతామాలక్ష్మి వంటి హిట్ మూవీస్ ఎన్నో ఉన్నాయి.