మిహిక చేతిపై వేయించుకున్న టాటూ అర్ధం ఏమిటో తెలుసా?

పెళ్లొచ్చినా కక్కొచ్చినా ఆగదన్న సామెతకు అనుగుణంగా టాలీవుడ్ లో ఇన్నాళ్లూ బ్యాచిలర్ గా ఉన్న దగ్గుబాటి రానా ఇపుడు ఓ ఇంటివాడవుతున్నాడు. పెళ్ళికి రెడీ అంటూ ఇటీవల తన ప్రేయసి మిహికా ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసి అందరికీ షాకిచ్చాడు.

ఫాన్స్ కి జోష్ నిచ్చే రానా పెళ్లి వార్తకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే, ఇరు కుటుంబాల వాళ్ళు కలుసుకున్నారు. ముహూర్తం కూడా పెట్టేసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించబోతున్నారు. అయితే రానా పేరులోని ఆర్ అక్షరాన్ని, తనపేరులోని ఎం అక్షరాన్ని కల్పి మిహికా టాటూ వేయించుకుంది.

ఈవిధంగా వేయించుకున్న టాటూ ఫోటో ఇంస్టాగ్రామ్ లో మిహికా పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఏమిటంటే అనంతం అనే అర్ధం వచ్చేలా తమది అనంతమైన ప్రేమ అని చాటిచెబుతూ మణికట్టుపై టాటూని డిజైన్ చేసినట్లు మిహికా చెబుతోంది.