Movies

తెలుగులో నటించిన స్పానిష్ నటి ఎవరో తెలుసా? నమ్మలేని నిజాలు

సొంత భాషపైనే పట్టులేని ఈరోజుల్లో దేశం కానీ దేశం,భాషకాని భాష అని చెప్పే స్పెయిన్ కి చెందిన ఆల్బా ఫ్లోరిస్ తెలుగులో సత్తా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా మనీ హైస్ అనే సిరీస్ చాలా పాపులర్ అయింది. ఈ సిరీస్ లో పాత్రలకు,ఆ పాత్రల్లో నటించినవాళ్లు మంచి గుర్తింపు పొందారు. అందులో స్పెయిన్ కి చెందిన నటి ఆల్బా ఫ్లోరిస్ ఒకరు. నైరోబి పాత్రలో ఒదిగిపోయింది. దోపిడీకి సంబంధించిన డ్రామాతో కూడిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. 1986లో జన్మించిన ఆల్బా చిన్నతనం నుంచి నటనలో ఆసక్తి రావడానికి ఆమె తండ్రి మ్యూజిక్ కంపోజర్ ,తల్లి నాటకరంగం నుంచి వచ్చింది. 13ఏళ్ళ వయస్సులోనే నాటకంలో శిక్షణ తీసుకుంది. అనేక నాటకాలు వేసింది. హనోనిమోమా, హిరోషిమా వంటి వాటితో ఆల్బకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మంచి గుర్తింపు పొందిన ఆల్బా ఫ్లోరిస్ తెలుగు అమ్మాయిలా కనిపించడమే కాదు,తెలుగులోనే మాట్లాడింది.

1952లోనే వీరి కుటుంబం ఇండియాకు వచ్చారు. ఇక్కడే ఒక మిషనరీ పెట్టి ,పాఠశాలలు నడిపారు. పేదలకు అండగా నిలిచారు. గ్రామాల్లో మంచి నీటి ఎద్దడి నివారణకు గ్రామాల్లో 3వేల బావులు తవ్వించారు. ఏపీలో విన్సెన్ట్, అన్నా ఫెరీర్ దంపతులు 1969లో ఆసుపత్రులు ఏర్పాటుచేసి, పేదలకు బాసటగా నిలిచారు. 2009లో అనంతపురంలో 89వ ఏట విన్సెన్ట్ మరణించారు. 2013లో ఓ బయోగ్రఫీ కూడా తీశారు.

ఇందులో విన్సెన్ట్ గా ఇమోనల్ ఐయస్ నటించగా, అతడి సహాయకురాలు షామీరాగా ఆల్బా ఫ్లోరిస్ నటించింది. ఒంటిజడ, నుదుట బొట్టుతో తెలుగు అమ్మాయిగా నటించి ‘చిన్న మొత్తం మనచేతిలో ఉంటె మన అనంతపురం దళితులంతా ముఖ్యమైన మార్పు నకు’కారణం అవుతారంటూ తెలుగులో చెప్పింది. ఈ సంభాషిణాలన్నీ తెలుగులోనే ఉంటాయి. ఇందుకు సంభనిందించినవన్నీ ఫాన్ పేజీకి సంబంధించి ఇంస్టాగ్రామ్ లో పెట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ ఫోటోకి ప్రశంసలు వస్తున్నాయి. కేరీర్ లో తొలిదశలోనే ఇలాంటి సాహోసోపేత పాత్రలతో అదరగొట్టేసింది. భివిష్యత్తులో ఇంకెంతగా రాణిస్తుందో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. టివి ఛాన్స్ లు, వెబ్ సిరీస్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరైన ఆల్బా 2017లో మనీ హైస్ తో స్టార్ డమ్ తెచ్చేసుకుంది.