బన్నీ ఫేవరెట్ మూవీస్ ఏమిటో చెప్పేసాడు…తెలుగు సినిమా ఒక్కటి కూడా…?

ఎంతైనా సినిమా స్టార్స్ కూడా మనుషులే కదా. సామాన్యులలాగే,వారికి కూడా ఫేవరెట్ సినిమాలు ఉంటాయి. చాలామంది హీరో హీరోయిన్స్ కి ఫేవరెట్స్ చాలా మంది ఉంటారు కానీ స్టార్స్ కి కూడా ఫేవరేట్ హీరోలు,సినిమాలు ఉండడం గ్రేట్ కదా. అందుకే మన ఫేవరెట్ హీరోల ఫేవరెట్ సినిమాలు ఏంటో తెలుసుకోవడానికి అభిమానులు మాత్రం తెగ ఆరాటపడుతుంటారు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నాడట. అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు మలయాళంలో మంచి మార్కెట్ ఉంది.

మరోవైపు హిందీ డబ్బింగ్ చిత్రాలతో అక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఆ ధైర్యంతోనే పుష్ప మూవీని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ బాలీవుడ్ మూవీస్ పేర్లు బన్నీ వెల్లడించాడు. తనకు ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమాలు మూడు ఉన్నాయట. అందులో మొదటగా ‘జో జీతా వహీ సికిందర్’ అనే సినిమా ఎంతో ఇష్టమని చెప్పాడు. ఈ సినిమా దాదాపు 20సార్లకు పైగా చూసినట్లు బన్నీ చెప్పాడు.

ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా ‘తమ్ముడు’ గా రీమేకై పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మంచి హిట్ గా నిలిచింది. ఇక రెండోది షారుఖ్ ఖాన్ కాజోల్ నటించిన ఆల్ టైమ్ హిట్ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’. ఈ సినిమా ఎప్పుడు చూసినా.. తెలియని కొత్త అనుభూతి కలుగుతుంద ని బన్నీ భావన. ఇక మూడోది గతేడాది విడుదలై అవార్డుల పంట పండించిన ‘గల్లీబాయ్’. రణ్ వీర్ సింగ్ – ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా అంటే రీసెంట్ గా తన మనసును టచ్ చేసిందని తెలిపాడు. ఈ విషయం తెలిసినప్పటి నుండి బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాలను చూడటానికి ట్రై చేస్తున్నారట.