Movies

సాగర సంగమం సినిమా వెనక కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

ఆదుర్తి సుబ్బారావు శిష్యునిగా చిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న కళా తపస్వీ విశ్వనాధ్ తీసిన శంకరాభరణం తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ట్రెండ్ సెట్టర్ గా నిల్చింది. పూర్ణోదయా పతాకం పై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా తర్వాత విశ్వనాధ్ ,ఏడిద కాంబోలో పలు సినిమాలు వచ్చాయి అందులో కమలహాసన్, జయప్రదల కాంబినేషన్‌లో నిర్మించిన ప్రతిష్టాత్మక కళాత్మక చిత్రం ‘సాగర సంగమం’ ఒకటి. ఈ చిత్రం 1983 జూన్ 3న తెలుగులో ‘సాగర సంగమం’ గా, తమిళంలో ‘సలంగై ఓలి’, మలయాళంలో ‘సాగర సంగమం’ గా ఒకే రోజు విడుదల అయ్యాయి. అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది. కళా తపస్వీ కే విశ్వనాథ్, కమల్ హాసన్, జయప్రద కాంబినేషన్‌లో వచ్చిన అద్భుత చిత్రం ‘సాగర సంగమం’.

ఈ సినిమా వచ్చి సరిగ్గా 37 ఏళ్ల క్రితం వచ్చిన సాగర సంగమం సంగీత నాట్య ప్రధాన చిత్రం. అందుకే శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం గా నిల్చింది. .భారత చలనచిత్ర 100 సంవత్సరాలు సందర్భంగా సి ఎన్. ఎన్ /సి బి ఎన్ రూపొందించిన 100 ఉత్తమ చిత్రాల్లో ‘సాగర సంగమం’ చిత్రం 13 వ స్థానం దక్కించుకుంది.జయప్రద, కమల్ హాసన్ కాంబినేషన్‌లో కే.విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం శతదినోత్సవం తో పాటు ఎన్నో కేంద్రాలలో సిల్వర్ జూబిలీ , గోల్డెన్ జూబిలీ కూడా జరుపుకున్నాయి. పక్కరాష్ట్రం లోని బెంగుళూరు లో 511 రోజులు ఒకే థియేటర్ లో ప్రదర్శింపబడ్డ చిత్రం సాగర సంగమం రికార్డ్ క్రియేట్ చేసింది. ‘సాగర సంగమం’ చిత్రం విడుదలయ్యాక చాలా మంది శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి డాన్స్ క్లాసులకి వెళ్లేవారు .

ఇప్పటికీ జయప్రదతో పాటు కమలహాసన్ తనకు బాగా నచ్చిన చిత్రాల్లో సాగర సంగమం పేరే తొలివరుసలో ఉంటుందని ఎన్నో ఇంటర్యూలో చెప్పాడు. కళా తపస్వి కే.విశ్వనాధ్ దర్శక ప్రతిభ ప్రతీ సన్నివేశంలో మనకు కనబడుతుంది.జంధ్యాల మాటలు, వేటూరి పాటలు , నివాస్ ఫోటోగ్రఫీ , తోట తరణి కళా దర్శకత్వం ఇంకా ఎందరో ప్రతిభావంతుల కలయికే ఈ చిత్రాన్ని ఆల్ టైమ్ క్లాసిక్‌గా రూపుదిద్దింది. కమలహాసన్ నూతి మీద డాన్స్ చేసే “తకిట -తధిమి” పాట , జయప్రద తో కలిసి చేసే “ నాద వినోదము “ క్లైమాక్స్ లో వచ్చే “వేదం అణువణువున” పాటల్లో కమలహాసన్ చేసిన క్లాసికల్ డాన్సులు ఇప్పటికీ మనకి ఓ కొత్త అనుభూతినిస్తాయి.

మౌనమేలనోయి పాటలో కమల్ హాసన్, జయప్రద చూపిన హావభావాలు , ఎస్.పి. శైలజ నటన ఈ చిత్రానికి మరో ప్రత్యేకత. ఇందుకు ప్రధాన కారణం ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ఓ హై లైట్. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరింది. అప్పటికే ఎన్నో తమిళ సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి ఓ ట్రెండ్ సెట్ చేసిన ఇళయరాజాకు మొట్ట మొదటి సారి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి ఇచ్చిన చిత్రం సాగర సంగమం. అంతేకాదు ఎస్.పి.బాలసుబ్ర హ్మణ్యం కీ ఉత్తమ గాయకునిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది.

ఈ చిత్ర శతదినోత్సవానికి హిందీ అగ్ర నటులు రాజకపూర్ , సునీల్ దత్ , రాజేంద్ర కుమార్ ముఖ్య అతిధులుగా వచ్చి, సాగర సంగమం గురించి ఎంతో గొప్పగా విశ్లేషించారు.రష్యన్ భాషలోకి అనువదించి అక్కడి 400 థియేటర్లలో ఒకే సారి విడుదలయ్యి వారి అభిమానాన్ని కూడా పొందిన మొట్ట మొదటి తెలుగు చిత్రం.మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌లో నిర్మాత ఏడిద నాగేశ్వరరావుతో దర్శకుడు కే. విశ్వనాథ్ పాల్గొన్నారు.