చిరంజీవి దగ్గర కొరటాల శివ బుక్ అయ్యాడా…అసహనంతో ఉన్నాడా…?

ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత అంతటి ఇమేజ్ సొంతంచేసుకుని వరసగా నాలుగు విజయాలను అదికూడా అందరు స్టార్ హీరోలతోనే చేసి కొరటాల శివ మెప్పించాడు. బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. ఆయన ఊ అంటే స్టార్ హీరోలంతా డేట్స్ ఇవ్వడానికి సై అంటారు.

అలాంటి దర్శకుడు రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు.

చిరంజీవితో సినిమా చేయాలని చూసి చివరికి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా తీసుకురాలేదు. సైరా సినిమా తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని వచ్చిన చిరంజీవి.

ప్రస్తుతం కొరటాల తీస్తున్న ఆచార్యతో బిజీగా ఉన్నాడు.

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు 2020లోనే సినిమా తీసుకొద్దామనుకుంటే ఇప్పుడు కరోనా మహమ్మారి ఆపై లాక్‌డౌన్,బ్రేక్ కొట్టాయి.

నిజానికి ఈ సినిమా అనుకున్న దానికంటే కూడా చాలా నెమ్మదిగా షూటింగ్ నడిచి,. ఇప్పటి వరకు కనీసం 40 శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ సినిమా కోసం ఫారెన్ షెడ్యూల్స్ ఏం లేవు.

అంతా ఇక్కడే ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. లాక్ డౌన్ ముందు వరకు బాగానే సాగినా కూడా ఒక్కసారిగా భారీ బ్రేక్ రావడంతో అంతా దారి తప్పింది. ఇందులో చిరు లుక్ కూడా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తుంది.

పక్కా కమర్షియల్ కథతోనే కొరటాల వస్తున్నాడు . దానికి తన స్టైల్ ఆఫ్ సందేశాన్ని కూడా మిక్స్ చేస్తున్నాడు.

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 20 కోట్లకు పైగా ఖర్చుతో ఓ భారీ కాలనీ సెట్ నిర్మించారు.

ఈ భారీ సెట్‌లోనే ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిరంజీవిపై ఆ మధ్య తెరకెక్కించాడు. అక్కడే ఓ గుడి సెట్ కూడా వేస్తున్నారు.ఈ చిత్ర కథ అంతా ఓ గుడి చుట్టూనే తిరుగుతుంది.

దేవాదాయ శాఖలో జరిగే అన్యాయాలను ఈ సినిమాలో హైలైట్ చేస్తున్నాడు కొరటాల. అందుకే సినిమాలో భారీ సెట్ నిర్మాణం వేసారు.

ఇక సెట్‌లోనే సినిమా ఎక్కువ భాగం షూటింగ్ చేయబోతున్నాడు దర్శకుడు. అసలు విషయం ఏమిటంటే, ఆచార్యలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

రాజమౌళి సినిమా డేట్స్ కానీ క్లాష్ అయ్యాయంటే ఆచార్య మరింత ఆలస్యం అవుతుంది. లాక్‌డౌన్ కారణంగా ట్రిపుల్ ఆర్ కూడా చాలా ఆలస్యమైంది.

దాంతో ఆయన కూడా పని త్వరగా పూర్తి చేయాలని ఆరాటపడుతున్నాడు.

ఈ చిత్రం అనుకున్న దానికంటే ఆలస్యం కావడంతో కొరటాల కూడా అసహనంతో ఉన్నాడని తెలుస్తుంది.

భరత్ అనే నేను తర్వాత కొరటాల నుంచి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు.

చూస్తుంటే 2020 కూడా ఖాళీగా వదిలేసేలా కనిపిస్తున్నాడు.

చిరంజీవితో సినిమా అంటూ పాపం అక్కడే అడ్డంగా లాక్ అయిపోయాడంటూ కొరటాలను చూసి నెటిజన్లు చేయని కామెంట్ లేదు.