Movies

రాజమౌళి భవిష్యత్తు ప్లానింగ్‌ ఏమిటో చూస్తే షాక్ అవ్వాల్సిందే

రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను సాధించాయి.భారీ బడ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన బాహుబలి చిత్రం దాదాపుగా నాలుగు ఏళ్లు సాగినా కూడా ఎలాంటి అడ్డంకులు రాలేదు.

కాని ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంకు మాత్రం జక్కన్న ప్రారంభించినప్పటి నుండి కూడా ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి.జక్కన్న గత చిత్రాలు బ్లాక్‌ బస్టర్స్‌ సాధించగా ఈ చిత్రం మాత్రం అడ్డంకులతో పలు అనుమానాలకు తావిస్తుంది.

ఎన్నో విషయాలు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై చెడు అభిప్రాయం కలిగేలా చేస్తున్నాయి.ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం విడుదల విషయంలో క్లారిటీ లేకుండా ఉంది.ముందుగా ప్రకటించిన ప్రకారం జులై 30న సినిమాను విడుదల చేయాల్సి ఉంది.కాని షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామంటూ ప్రకటించారు.

కరోనా కారణంగా ఇప్పుడు ఆ తేదీకి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.సినిమా షూటింగ్‌ ఎప్పుడు మొదలు పెడతాడు, ఎప్పుడు విడుదలకు ప్లాన్‌ చేస్తాడు, సినిమాపై ఉన్న కొన్ని నెగటివ్‌ కామెంట్స్‌కు జక్కన్న ఎలా భవిష్యత్తులో సమాధానం చెప్పబోతున్నాడు అనేది అందరు ఎదురు చూస్తున్న ప్రశ్నలు.

రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని పూర్తి చేసేందుకు మరో మూడు నెలల సమయం తీసుకోనున్నాడు.ఆ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కు కనీసం అయిదు నెలల సమయం పడుతుందని అంటున్నారు.కనుక వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.అందుకు తగ్గట్లుగా రాజమౌళి తన భవిష్యత్తు ప్రణాళికను ఎలా ప్లాన్‌ చేసుకుంటాడో చూడాలి.