Movies

తన మీద వస్తున్నా రూమర్స్ పై హన్సిక ఏమని చెప్పిందో…నిజామా…అబద్దమా…?

హన్సికకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గటంతో పెళ్లి ప్రయత్నాలలో పడిందని వరుడు వ్యాపారవేత్త ప్రచారం జరుగుతుంది. ఈ విషయం ఆలా ఆలా హన్సిక వరకు వెళ్లటంతో ఆమె ట్విట్టర్ లో ఆమె ఒక్కసారిగా నవ్వేసి ‘నాకు పెళ్లా?… నేను పెళ్లి చేసుకొనే ఆ వ్యాపారవేత్త ఎవరో చెప్పరూ’ అని పోస్ట్ పెట్టింది. ఇక హన్సిక పెళ్లి చేసుకోబోతోందంటూ వచ్చిన వార్తలను చూసి ఆమె అభిమాని ఒకరు హర్ట్‌ అయి, ‘ఈ విషయం నాకు చెప్పనేలేదే’ అని కామెంట్‌ చేశాడు. ఏం చెయ్యను… నాకు కూడా ఇప్పుడే తెలిసింది’ అని ఫన్నీగా సమాధానం ఇచ్చింది హన్సిక.

తమిళ హీరో శింబు, హన్సిక గతంలో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. హన్సికను పెళ్లి చేసుకోబోతున్నానంటూ 2013లో శింబు ఓపెన్‌గా ప్రకటించారు కూడా. చాలా కాలం ప్రేమించుకొన్న వీరిద్దరూ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. హన్సిక ప్రస్తుతం నటిస్తున్న ‘మహా’ తమిళ చిత్రంలో ఆమె మాజీ ప్రియుడు శింబు అతిథి పాత్ర పోషిస్తుండడం గమనార్హం.