మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన స్నేహ…నిజం ఎంత?
స్నేహ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి చేసుకొని సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చి మరల రీ ఎంట్రీ ఇచ్చి సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. దాదాపుగా స్టార్ హీరోలు అందరితో యాక్ట్ చేసింది. చాలా తక్కువ సమయంలో మంచి సినిమాలను చేసింది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
ఆమె చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేస్తో ముందుకు వెళ్తున్నారు. ఇక చిరంజీవి కి ఆమె ఒక సినిమాలో భార్య గా నటించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై కాస్త స్పష్టత రావలసింది. ఈ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త నిజం అయితే చిరంజీవికి హీరోయిన్ దొరికినట్టే.

