శ్రీకాంత్ కొడుకు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?
టాలీవుడ్ లో చాలామంది వారసత్వంగా వస్తుంటే, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో ఇండస్ట్రీకి వచ్చి, వంద సినిమాలకు పైనే చేసిన స్టార్ హీరో శ్రీకాంత్ కి మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. విలన్ గా మొదట్లో నటిస్తూ తాజ్ మహల్ మూవీతో హీరో అయ్యాడు. ఇక పెళ్లి సందడి మూవీతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్స్ సాధించింది. అయితే ప్రస్తుతం కొత్తతరం హీరోల సందడి నడుస్తున్న నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేస్తూ వస్తున్నాడు.
అందరిలాగే తన కొడుకుని కూడా హీరోగా చేయాలని భావించి,పెద్ద కుమారుడు రోషన్ ని వెండితెరకు ఎంట్రీ ఇప్పించాడు. కింగ్ నాగార్జున సొంతంగా నిర్మించిన నిర్మలా కాన్వెంట్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రోషన్ కి ఆ సినిమా సక్సెస్ అందించలేదు. దీంతో నటనపై మరిన్ని మెళుకువలు నేర్చుకున్న రోషన్ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఇందుకోసం భారీగానే రంగం రెడీ అయిందట. అయితే ఈ మూవీ ఎవరు తీస్తారన్న దానిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
కె రాఘవేంద్రరావు కథ, దర్శక నిర్మాణ పర్యవేక్షణలో ఆయన శిష్యుడు గౌరీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ మార్కెట్ భాగస్వామ్యం దిల్ రాజు చూస్తాడట. లాక్ డౌన్ తర్వాత సినిమా పట్టాలెక్కనుంది. రాఘవేంద్రరావు కి చెందిన ఆర్ కె అసోసియేట్స్ బ్యానర్ అలాగే ,దిల్ రాజు బ్యానర్ రెండూ పెద్దవే కనుక ఈ సినిమా రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు.

