Movies

దీపికా బాడీగార్డ్‌ నెల జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

దశ వెలుగుతున్నప్పుడు, మార్కెట్ లో క్రేజ్ ఉన్నప్పుడు హీరో హీరోయిన్స్ రేంజ్ మాములుగా ఉండదు. అందుకే పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ వసూలు చేస్తూ అందరినీ షాక్ కి గురిచేస్తుంటారు. ఇక కొందరు స్టార్ హీరోహీరోయిన్లు అయితే ఏకంగా సినిమా రంగానికి చెందిన అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకూంటూ మిగతావారు తమను చూసి ఈర్ష్య పడేలా ఉంటుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ కోవలోకే చెందింది.

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతున్న ఈ బ్యూటీ, రెమ్యునరేషన్ పరంగా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఛార్జి చేస్తోందట. అయితే ఇంత భారీ మొత్తంలో తీసుకుంటున్న దీపికా బాడీగార్డ్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తుందో అని వాకబు చేశారట. దీంతో దిమ్మతిరిగే నిజం బయటపడిందట. అవును దీపికాను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చే బాడీగార్డ్ జమాల్‌కు ఆమె ప్రతినెలా రూ.6.5 లక్షలు ఇస్తోందట. ఓ బార్డీగార్డ్‌కు ఇంత భారీమొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడం దీపికాకే చెల్లింది.

తన పర్సనల్ బాడీగార్డ్‌గా జమాల్ దీపికా ఇచ్చే మొత్తం ఓ టాప్ కంపెనీ ఉద్యోగికంటే కూడా చాలా ఎక్కువని అంటున్నారు. ఓ స్టార్ బ్యూటీ బార్డీగార్డ్‌కు ఇంత భారీ రెమ్యునరేషన్ ఉందనే వార్త నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం కావడం విశేషమే. అటు దీపికా భర్త రణ్‌వీర్ సింగ్ కూడా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ బాలీవుడ్‌లో బిజీ హీరో గా రాణిస్తున్నాడు. మొత్తానికి భార్యాభర్తలిద్దరూ కలిసి బాలీవుడ్‌లో ఎక్కువ రెమ్యునరేషన్ ఛార్జి చేస్తున్న జంటగా నిలిచారు. మరి ఫాన్స్ కి గర్వకారణమే కదా.