విజయేంద్ర ప్రసాద్ కొడుకుని పక్కన పెట్టేస్తున్నాడా…కారణాలు ఇవేనట
ఇండియన్ సినిమాను అంతర్జాతీయ రేంజ్ కి తీసుకెళ్లడంలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కృషి మొదటి స్థానంలో ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే .. ‘బాహుబలి’ వన్,టు చిత్రాలతో మన తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాడని అందరూ అనే మాట. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అందుకే జక్కన్నతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ టెక్నీషియన్, నటీనటులు కోరుకోవడం సహజం. ఇక ఈయన తండ్రి టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా ఉన్న విజయేంద్ర ప్రసాద్ అని తెలుసు కదా. ఈయన కన్నడ తమిళ్ హిందీ సినిమాలకు కూడా స్టోరీస్ అందించాడు. తన ఆలోచలను సినిమాలుగా మలిచి విజువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో జక్కన్న ప్రతి విజయం వెనక తండ్రి విజయేంద్ర ప్రసాద్ రోల్ కీలకం. ‘స్టూడెంట్ నెం. 1’ ‘మర్యాద రామన్న’ ‘ఈగ’ సినిమాలు మినహా జక్కన్న ప్రతీ సినిమాకి తండ్రే స్టోరీ అందించాడు.
నిజానికి జక్కన్న ఇండస్ట్రీకి రాకముందు నుంచీ విజయేంద్ర ప్రసాద్ కథలు అందిస్తున్నారు. డైరెక్టర్ గా కూడా వ్యవరించారు. ‘జానకీరాముడు’ ‘బొబ్బిలి సింహం’ ‘సమరసింహా రెడ్డి’ ‘ఘరానా బుల్లోడు’ ‘మణికర్ణిక’ ‘మెర్సల్’ ‘రాజన్న’ ‘భజరంగీ భాయిజాన్’ ‘తలైవి’ లాంటి స్టోరీలు బయట దర్శకులకు విజయేంద్ర ప్రసాద్ అందించాడు. ఇక తన కొడుకు కోసం ‘సింహాద్రి’ ‘సై’ ‘యమదొంగ’ ‘విక్రమార్కుడు’ ‘ఛత్రపతి’ ‘బాహుబలి – ది బిగినింగ్’ ‘బాహుబలి – ది కంక్లూజన్’ స్టోరీలను అందించాడు. ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి కూడా కథ ఈయన ఇచ్చిందే. స్వాతంత్ర్య సమరయోధులు ‘అల్లూరి సీతారామరాజు’ ‘కొమరం భీమ్’ నిజ జీవిత పాత్రలతో.. వీరిద్దరూ కలిసి పోరాటం చేసినట్లు కల్పిత కథ సృష్టించాడు. ఈ క్రమంలో జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’కి కూడా విజయేంద్ర ప్రసాద్ రచయితగా వ్యవహరిస్తాడని అనుకున్నారు.
అయితే రాజమౌళిని వదిలి ‘మహాభారతం’ కోసం వేరే స్టార్ హీరోతో విజయేంద్ర ప్రసాద్ జత కట్టబోతున్నాడట. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎప్పటి నుండో ‘మహాభారతం’ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో చాలా మంది రైటర్స్ ని ఎప్రోచ్ అయ్యాడు. చివరకి విజయేంద్ర ప్రసాద్ అయితే ఈ స్టోరీకి న్యాయం చేయగలడని అమీర్ ఖాన్ ఓ నిర్ణయానికి వచ్చాడట. నిజానికి ‘మహాభారతం’ని వెబ్ సిరీస్ గా తీయాలని అమీర్ అనుకున్నాడట. అయితే ఇప్పుడు ఈ సినిమా పలు భాగాలుగా తీయాలని ఆలోచిస్తున్నాడట. మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటిస్తున్నాడు. ఇక విజయేంద్ర ప్రసాద్ తనయుడితో కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్ట్ చేస్తూనే మరోపక్క మహేష్ బాబు సినిమాలకు పని చేయనున్నాడు. అయితే ‘మహాభారతం’ కోసం విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాలతో పాటు పారలెల్ గా వర్క్ చేసే ఛాన్స్ పై క్లారిటీ రావాల్సి ఉంది.

