Movies

నితిన్ 18 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్ని అటు పోట్లు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు

తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ సినిమాతో 2002లో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యంగ్ హీరో నితిన్ అప్పుడే 18 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్నాడు. నితిన్ 18 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. నితిన్ ఫ్యాన్స్ కామన్ డీపీతో ట్విట్టర్ లో #18YearsForNITHIINinTFI హ్యాష్ ట్యాగ్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఇక త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. నితిన్ కెరీర్ లోకి వెళ్తే, ఫస్ట్ సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నాడు. ‘జయం’ ఘన విజయం సాధించడంతో నితిన్ వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే, ఆ తర్వాత వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ‘దిల్’ సినిమాతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైపోయాడు.

దర్శక ధీరుడు జక్కన్న తీసిన ‘సై’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. అయితే నితిన్ సినీ కెరీర్ సాఫీగా సాగలేదు. ఎందుకంటే, హిట్లు తో పాటు ప్లాపులు కూడా మూటగట్టుకున్నాడు. ఒకానొక దశలో వరుసగా అరడజను సినిమాలకు పైగా ఫ్లాపులు చవిచూశాడు. అయినా నితిన్ కృంగిపోకుండా.. ఆటుపోట్లను ఎదుర్కొంటూ పడిలేచిన కెరటం వలె మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడు. ‘ఇష్క్’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘హార్ట్ అటాక్’ ‘అ ఆ’ సినిమాలతో బాక్సాఫీస్ కి తానేంటో మరోసారి చూపించాడు. హిట్ ప్లాపులను పట్టించుకోకుండా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ‘భీష్మ’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న హీరో నితిన్ ఇప్పుడు జోరు మీద ఉన్నాడు.

తాజాగా యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతేకాకుండా డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి తో ఓ సినిమా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఇలా టాలీవుడ్ లో వరుస సినిమాలతో క్రేజీ హీరోగా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. నితిన్ ఈ 18 ఏళ్ళ సినీ కెరీర్లో 27 సినిమాల్లో హీరోగా నటించాడు. కె.రాఘవేంద్రరావు, రాజమౌళి, పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ రామ్ గోపాల్ వర్మ, వీ.వీ. వినాయక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి స్టార్ డైరెక్టర్స్ మొదలుకొని… కొత్త దర్శకుల వరకు అందరితోనూ కలిసి పనిచేశాడు. అంతేకాదు, ప్రస్తుతం హిందీలో కూడా నితిన్ కి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. నితిన్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి వదిలితే నార్త్ ఇండియన్స్ బానే చూస్తున్నారట