Movies

రమ్యకృష్ణ బాలీవుడ్ లో సెటిల్ కాకపోవడానికి అసలు కారణం ఇదేనట

‘భలే మిత్రులు’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సీనియర్ అందాల తార రమ్యకృష్ణ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 1985లో విడుదలైన 1989లో ‘సూత్రధారులు’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు పొందింది. కానీ రమ్యకృష్ణకి సరైన ఛాన్స్ లు రాని సమయంలో 1992లో మోహన్ బాబు హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన అల్లుడుగారు సినిమా ఆమె కెరీర్ ని మలుపుతిప్పింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ కన్నడ మలయాళం ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేసి, దాదాపు సౌత్ ఇండస్ట్రీలలో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన రమ్యకృష్ణ పనిచేసింది.

అయితే సౌత్ సినిమాలు చేస్తున్నప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా పిలుపు రావడంతో అటు వైపు కూడా అడుగులు వేసింది. ఖల్నాయక్.. క్రిమినల్.. . బడే మియా చోటే మియా వంటి హిట్ సినిమాలతో హిందీ ప్రేక్షకులను కూడా అలరించిన రమ్య ఆతర్వాత వెనక్కి వచ్చేసింది.ప్రస్తుతం పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండల ఫైటర్ సినిమాలు నటిస్తున్నట్లు తెలిపింది. ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

‘నేను హిందీలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వాటి పై సంతకం చేయలేదు. ఎందుకంటే నిజానికి నా సినిమాలు బాలీవుడ్లో సరిగ్గా ఆడలేదు. నాకు వచ్చిన ఆఫర్లు కూడా అంత ఇంటరెస్ట్ అనిపించలేదు. అందుకే హిందీలో ఎక్కువ సినిమాలు చేయలేదు. మరో విషయం ఏంటంటే.. ఆ టైంలో నేను సౌత్ లో స్టార్డం పొందుతున్నాను”అని రమ్యకృష్ణ వివరించింది. అయితే చాలా కాలం తర్వాత బాహుబలి సినిమాతో మళ్లీ హిందీ ప్రేక్షకులను పలకరించింది. తాజాగా చేస్తున్న ఫైటర్ మూవీ కూడా మరో బాహుబలిగా రుజువు చేస్తుందని వెల్లడించింది.