Movies

ఇప్పట్లో నో షూటింగ్స్ అంటున్నారా స్టార్ హీరోస్…ఇప్పట్లో సినిమాలు లేనట్టే

కరోనా మహమ్మారి కారణంగా సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత సడలింపులు ఇస్తుండడంతో కొన్ని వారాల క్రితం టాలీవుడ్ సినీ పరిశ్రమ పెద్దలు షూటింగ్ లకు సంబంధించిన అనుమతుల కోసం వరుసగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను కలిశారు. రెండు మూడు సార్లు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం అనేక నిబంధనలతో షూటింగ్ లకు అనుమతులు సాధించారు. అయితే ఎప్పుడైనా అనుమతులు వచ్చాయో అప్పటి నుంచి దేశంలో ,అలాగే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సీన్ రివర్స్ అయింది. కరోనా కేసుల తీవ్రత పెరగడంతో షూటింగ్ మొదలు పెట్టడానికి అగ్రహీరోలు దర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. అగ్ర హీరోలు,స్టార్ హీరోలు మళ్లీ షూటింగ్ మొదలు పెట్టడానికి వెనుకంజ వేశారు.

కరోనావైరస్ తీవ్రత తగ్గినప్పుడే షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తామని వారు నిర్ణయించారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టెస్ట్ షూట్ చేద్దామని నిర్ణయించుకొని , అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నాక సైతం ఎస్ఎస్ రాజమౌళి రద్దు చేయడం ఇందుకు తార్కాణం. అదేవిధంగా స్టార్ హీరో వెంకటేష్ తాజాగా తన కొత్త సినిమా నారప్ప షూటింగ్ జరపవద్దని డిసైడ్ అయిపోయాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య సినిమా ఇప్పట్లో ప్రారంభించే యోచనలో లేదట. ఇప్పటికే సెట్స్లో ఉన్న కొన్ని సినిమాలు మాత్రమే పూర్తి చేస్తున్నారు. కొత్తగా ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ‘సర్కారు వారిపాట’ వాయిదా వేయడానికే నిర్ణయం తీసుకున్నాడట.

ఇప్పటికే కొన్ని రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్ విజయ్ అజిత్ సూర్య తదితరులు 2020 సంవత్సరాన్ని మిస్ అవ్వబోతున్నామని ప్రకటించారు. ఈ సంవత్సరం వారు షూటింగ్ చేయమని తీర్మానం చేసుకున్నారు. ఇక సినిమాలు కూడా విడుదల చేయమని డిసైడ్ అయ్యారు. అందరూ 2021 లో తిరిగి పని ప్రారంభిస్తామని, అదీ కరోనా తగ్గితేనే అని అంటున్నారు. చాలా మంది టాలీవుడ్ హీరోలు షూటింగ్ ని వాయిదా వేస్తున్నారు. రాబోయే కొద్ది నెలల్లో షూటింగ్ లేకపోతే మరో ఆరు నెలల వరకు సినిమాలు ఉండవని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా సగం పూర్తయిన సినిమాలే పరిస్థితిని బట్టి ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. మొత్తానికి షూటింగ్స్ కి దూరంగా ఉంటున్న తమిళ హీరోలను తెలుగు తారలు కూడా ఫాలో అవుతున్నారన్నమాట.