Movies

సుశాంత్ ఆత్మహత్య ఘటనపై రేణు షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించిన ఘటనపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనివెనుక కుట్ర దాగిఉందంటూ కొంతమంది టార్గెట్ కి నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై విమర్శలు ,వివాదాలు నడుస్తున్నాయి. సిబిఐ విచారణకు ఆదేశించాలన్న డిమాండ్ కూడా వస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంటున్న టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా ఈ ఘటన పై సంధిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఈ మధ్య రేణుదేశాయ్ దర్శకత్వంపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అంతే కాక గతంలో పలు సందర్భాల్లో కూడా తాను ఓ చిత్రానికి దర్శకురాలిగా నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. సినిమా పరిశ్రమలో రాణించాలంటే కేవలం సినిమా కుటుంబ బ్యాక్ గ్రౌండ్, డబ్బు ఉంటే సరిపోదని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే మానసిక ధైర్యం కూడా కావాలని సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే సరిగ్గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జీవితంలో కూడా అలాగే జరిగి ఉంటుందని కూడా అనుమానం వ్యక్తం చేసింది.

అలాగే సినీ పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్ తో పాటు ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, మానసిక ధైర్యం వంటివి కూడా ఉండాలని అప్పుడే మనం మన జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను ఎదుర్కొని ముందుకు సాగగలుగుతామని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ పూణే లో నివాసం ఉంటోంది.