ముఖేష్ అంబానీ విజయం వెనుక కీలకమైన పాత్ర పోషించేది ఎవరో తెలుసా ?

గతంలో ఎలా ఉన్నా రిలయన్స్ మార్కెట్ ఇప్పుడు బాగా పుంజుకుంది. దీనికి కారణం ప్రపంచంలో పేరుపొందిన కంపెనీలు రిలయన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే. అయితే ముఖేష్ అంబానీ ఇంతటి విజయం సాధించడానికి అంబానీ వెనుక గల వ్యక్తి గురించి ఇప్పుడు వార్తలొస్తున్నాయి.

అవును, అంబానీ వెనుక మనోజ్ మోడీ ఉన్నాడట. ఇతనెవరో బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే బయట ప్రపంచానికి కనిపించకుండా రిలయన్స్ ఇండస్ట్రీలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరుగా చెబుతారు. రిలయన్స్ రిటైల్ తో పాటు,రిలయన్స్ జియో ఇన్ఫో కమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ధీరూభాయ్ అంబానీ పెట్రో కమ్ ప్రారంభించిన నాటినుంచి కంపెనీలో ఉన్న వ్యక్తి .

నిజానికి ఆయన సలహాలతోనే రిలయన్స్ ఎన్నో స్టార్ట్ అప్ లను కొనేసింది. 2010లో ఎయిర్ డెక్కెన్ విక్రయంలో కూడా కీలక భూమిక వహించారు. ఈయన మీటింగ్ పెడితే ఎలాంటి సమస్య అయినా కొలిక్కి వచ్చినట్లే. అయితే ఆయన వ్యాఖ్యలు భిన్నంగా ఉంటాయి. ‘నాకు పెద్దగా ముందు చూపు లేదు. అంతర్గత విషయాలు పెద్దగా తెలియవు. వ్యూహాలు కూడా లేవు. సిబ్బంది ఎలా పనిచేయాలో శిక్షణ ఇస్తా. కీలక బాధ్యతలు ఎలా నిర్వహించాలో నేర్పిస్తా’అని మాత్రమే మనోజ్ మోడీ చెబుతారు.