లాక్ డౌన్ పుణ్యమా అని RRR లో కీలకమైన మార్పులు
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR మూవీ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అజయ్ దేవగన్ కనిపిస్తాడట. ఇప్పుడు రాజమౌళి అజయ్ దేవగన్ పాత్రను పెంచాడట. క్యామియో పాత్ర నుండి ఓ కీలకమైన పాత్రగా మార్చాడని వార్తలు వస్తున్నాయి. అజయ్ కి జోడిగా శ్రీయ నటిస్తుంది.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ లు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రత్యేక సెట్ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ జరపాలని రాజమౌళి నిర్ణయించారు. ఇప్పటికే షూటింగ్ మొదలుకావాల్సివుంది. ఐతే హైదరాబాద్ లో కరోనా భయం అధికంగా ఉన్న తరుణంలో షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి కాస్త ఆలోచనలో పడ్డారు RRR టీమ్.
