Movies

జగపతిబాబు జోరు తగ్గటానికి కారణం ఆ నిర్మాత …నిజం ఎంత ?

జగపతి ఆర్ట్స్ బ్యానర్ మీద ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీసిన వి బి రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు ఫ్యామిలీ హీరోగా లేడీ ఫాలోయింగ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. వరుస హిట్స్ తో టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోయాడు. రకరకాల కారణాల వలన యంగ్ హీరోల తాకిడి కారణంగా జగపతిబాబు డౌన్ అవ్వడంతో సినిమాల్లో ఎలాగోలా నిలదొక్కుకోవాలని భావించి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.

తెలుగులో విలన్స్ తక్కువగా ఉండడం జగ్గూభాయ్ కి బానే కలసివచ్చింది. బోయపాటి శ్రీను తీసిన లెజెండ్ మూవీతో విలన్ గా అద్భుత నటన కనబరిచి టాలీవుడ్ కి కొత్త విలన్ వచ్చాడని అనుకున్నారు. ఆవిధంగా నాన్నకు ప్రేమతో , గంగస్థలం,జయ జానకి నాయక, సాక్ష్యం,,అరవింద సమేత వీర రాఘవ,నేల టికెట్టు, మహర్షి వంటి మూవీస్ లో విలన్ గా అదరగొట్టేసాడు. అలాగని విలన్ గానే కాకుండా,హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ తో మంచి రోల్స్ కూడా వేసి క్యారెక్టర్ యాక్టర్ గా కూడా ముద్రపడ్డాడు.

అన్నీ బానే ఉన్నాయి .. కానీ కొన్ని సినిమాల్లో జగ్గూభాయ్ ని తప్పించడం పెద్ద షాక్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీలో జగపతిబాబుని నిర్మాత దిల్ రాజు,డైరెక్టర్ అనిల్ రావిపూడి తప్పించి, ప్రకాష్ రాజ్ ని పెట్టుకున్నారు. దీన్ని జగపతి బాబు బహిరంగంగానే చెప్పి బాధపడ్డాడు. ఇక పెద్ద సినిమాలు ఆర్ ఆర్ ఆర్,ఆచార్య, పుష్ప,వకీల్ సాబ్,నారప్ప,వంటి పెద్ద సినిమాల్లో జగ్గూభాయ్ కి ఛాన్స్ లు రాలేదు. అయితే ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న ‘వి.,ట్రక్ జగదీశ్,కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’,గుడ్ లక్ సఖి,మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఎంట్రీ మూవీస్ లలో చేస్తున్నా, పెద్ద సినిమాలు మాత్రం లేవు. అయితే తనవంతుగా విలన్,క్యారెక్టర్ ఆర్టిస్టుగా జగపతి బాబు తన సత్తా చాటే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.