Movies

ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న మెగా అల్లుడు…కారణం ఇదేనట

కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కొంత మంది బయటకు రాకుండా ఇంటిలోనే ఉంటున్నారు. మరి కొంతమంది దైర్యముగా బయటకు వస్తున్నారు. ఆలా దైర్యంగా బయటకు వచ్చి సీరియల్స్,సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నటిస్తున్నవారు ఇంటిలోని వారికీ ఇబ్బంది కలగకుండా స్వీయ నిర్బంధన నియమాన్ని పాటిస్తున్నారు. ఇక విషయానికి వస్తే చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో సినిమా సూపర్ మచ్చి సెట్స్ మీద ఉంది.

తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ అనుమతి ఇచ్చిన వెంటనే మొదలు అయినా సినిమాల్లో సూపర్ మచ్చి ఒకటి. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న కళ్యాణ్ దేవ్ షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటూ స్వీయ నిర్బంధన నియమాన్ని పాటిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ తన పనులను తానే చేసుకుంటున్నాడట.