సర్కార్ వారిపాట భారీ సెట్ – అక్కడే టోటల్ షూటింగ్…మహేష్ వస్తాడా మరి
సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట అనే సినిమా కమిట్ అయ్యాడు. పరశురామ్ దర్శకత్వంలోచేస్తున్న ఈ సినిమాతో మహేష్ మరోసారి తన బాక్సాఫీస్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. పరశురామ్ – మహేష్ బాబుల కాంబినేషన్ ఖచ్చితంగా వెరైటీగా ఉండబోతుందని ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనా వేస్తున్నాయి. దానికి తోడు సర్కారు వారి పాట టైటిల్ విపరీతంగా బజ్ కూడా క్రియేట్ చేసింది.
ఇప్పటికే ఈ సినిమా చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే ప్రేక్షకుల నుండి ఊహించని రేంజిలో స్పందన వచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల పోస్టర్ విడుదల కాగా ఇందులో మహేష్ లాంగ్ హెయిర్ లైట్ బియర్డ్ తో ఇంతక ముందెప్పుడూ చూడని మాస్ లుక్ తో అదరగొట్టాడు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ జోడీ కడుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీస్ తో పాటు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్.. 14రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మించనున్నాయి.
ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది? అనే సందేహం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ సినిమా ఆర్థిక నేరాల బ్యాక్ డ్రాప్ లో బ్యాంకు చుట్టూ తిరుగుతుందని టాక్. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సామాజిక అంశాలను చర్చలోకి రానుంది. ఈ సినిమాలో హీరో మహేష్ ఓ బ్యాంకు మేనేజర్ గా కనిపిస్తాడని అంటున్నారు. పరశురామ్ టీమ్ ఈ సినిమాకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఖర్చుతో బ్యాంకు సెట్ వేస్తున్నారట. షూటింగ్ తేది ఖరారైతే ఇక్కడే చాలా వరకూ షూటింగ్ కంప్లిట్ చేస్తారట.
