రామ్ చరణ్‌తో జోడి కట్టి ఫిదా చేస్తుందా…?
సినిమాల్లో రీ ఎంట్రీ తర్వాత ఇప్పటికే రెండు సినిమాలు విజయవంతంగా చేసి బ్యాక్ టు బాస్ అంటే నిజం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక కొరటాల,చిరంజీవి తొలిసారి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఫాన్స్ అయితే మరీ ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చిరంజీవి ఓ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడు.
అయితే ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నందున చరణ్ సరసన నటించేందుకు అందాల భామ సాయి పల్లవిని సంప్రదించాలని చిత్ర యూనిట్ చూస్తోంది. నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోయే పాత్ర కావడంతో, ఈ పాత్రను సాయి పల్లవి అయితే బాగా చేయగలదని కొరటాల భావిస్తున్నాడు.ఇప్పటికే ‘విరాటపర్వం’ చిత్రంలో నటిస్తున్న సాయి పల్లవి ఇలాంటి పాత్ర చేస్తుండటంతో మరోసారి అలాంటి పాత్ర చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
కాగా చరణ్ ఎలాంటి కేమియో పాత్రలో నటిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కొరటాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్ చేయబోయేది ఓ నక్సలైట్ పాత్ర అని తెలుస్తోంది. గతంలో ఈ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, ఆలియా భట్ల పేర్లు వినిపించినా వారు ఈ సినిమాలో నటించడం లేదని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
