జబర్ధస్త్ మాస్టర్ ప్లాన్ అనసూయకు కల్సివచ్చేనా…దైర్యం చేస్తుందా…?
యాంకర్ గా, సినిమా స్టార్ గా తెలుగులో బుల్లితెరపై, బిగ్ స్క్రీన్ పై రెండువైపులా తన సత్తా చాటుతున్న అనసూయ కి ఫాన్ ఫాలోయింగ్ కూడా బానే ఉంటుంది. తనదైన అంద చందాలతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరించిన అనసూయ అంటే దాదాపు తెలియని తెలుగు ఆడియన్స్ ఉండరు. అయితే యాంకర్ అనపూయ ఇప్పుడు అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేసిందని, అది కల్సి వస్తే, ఆమెకు తిరుగుండద ని అంటున్నారు. ఇంతకీ ఈ అమ్మడు జబర్దస్త్ ప్లాన్ ఏమిటబ్బా అని ఆలోచిస్తే, ఉండరంటే అతిశయోక్తి కాదు. అనసూయ కేవలం టీవీ తెరకు పరిమితం కాకుండా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఆవిధంగా సినిమా పరంగా నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో ఆమె హుషారైన నటన అందరినీ కట్టిపడేసింది. ఆ తర్వాత ‘క్షణం’లో విలన్‌గా, ఆతర్వాత సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా కంటి తడిపెట్టించే పాత్రలతో తనలోని నటిని బయటకు తెచ్చింది. ప్రస్తుతం తెలుగు దర్శక,నిర్మాతలు అనసూయను దృష్టిలో పెట్టుకొని పలు స్టోరీలను రెడీ చేస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్, క్రిష్ మూవీలో కూడా ఈమె ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్స్ బిజినెస్ అంతగా లేదు. అందరు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసుకుంటున్నారు. అందుకే ఇక అనసూయ త్వరలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగు పెట్టబోతుంది. అనసూయ భరద్వాజ్ ..కొత్త కథలతో వెబ్ సిరీస్‌లను నిర్మించాలనే ఆలోచన నిజంగా మెచ్చుకోతగిందే. దీంతో పాటు నిర్మాతగా కూడా లక్ పరీక్షించుకోవాలని చూస్తోందని అంటున్నారు. అది సినిమాల పరంగా కాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఆమె నిర్మాతగా పలు వెబ్ సిరీస్‌లను నిర్మించే ఆలోచనలో అనసూయ ఉన్నట్టు టాక్.ఇప్పటికే ఆమె దీని కోసం ఒక టీమ్‌ను కూడా రెడీ చేసినట్టు టాక్. అందుకే అనసూయ తన అడుగులను ఓటీటీ వైపు వేస్తున్నట్టు టాక్.