Devotional

పెళ్లి అయ్యాక స్త్రీల ఇంటి పేరు ఎందుకు మారుతుంది?

మన పెద్దవారు పెట్టె ఆచారాలకు ఎదో ఒక పరమార్ధం ఉంటుంది. ఇప్పటి తరానికి వాటి గురించి పెద్దగా తెలియకపోయిన వాటి గురించి తెలుసుకోవలసిన అవసరం,బాధ్యత ఉండటమే కాకుండా తర్వాతి తరాలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మన హిందూ సంప్రదాయంలో వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహంలో అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి కార్యక్రమానికి ఒక అర్ధం పరమార్ధం ఉంటాయి. వివాహం తర్వాత అమ్మాయికి ఇళ్లుతో పాటుగా ఇంటి పేరు కూడా మారుతుంది.

ఇలా ఎందుకు మారుతుందో దానికి గల పరమార్ధం గురించి తెలుసుకుందాం. వివాహం తరువాత స్త్రీ తన ఇంటి పేరు మారటం వలన ఇది నా కుటుంబం అనే భావన కలగటమే కాకుండా ఆ ఇంటి పరువు, గౌరవ మర్యాదలు కూడా ఇక నుంచి నేను కూడా కాపాడుతానని ఓ బాధ్యతగా తీసుకున్నట్టుగా ఉంటుంది. ఈ సంప్రదాయం మనకి పురాతన కాలం నుంచి వస్తుంది. దాదాపుగా అందరూ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.