హీరోయిన్స్ గా రాణించిన అందాల పోటీ విజేతలు…ఎంతమంది ఉన్నారో తెలుసా ?
హీరోకి ఏమో గానీ సినీ హీరోయిన్ అవ్వాలంటే అందం,అభినయం రెండూ పుష్కలంగా ఉండాలి. ఇక అందాల పోటీలో గెలిచిన సుందరాంగులకు రెడ్ కార్పెట్ తెరిచే ఉంటుంది. చాలామంది విశ్వ సుందరీలు సినిమాల్లో కూడా ఏలేసారు. జీనత్ అమన్ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ధం రే దమ్ ,హరేకృష్ణ హరేరామ వంటి ఐటెం సాంగ్స్ తో ఓ ఊపు ఊపేసింది. 1984లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్న జూహ్లీ చావ్లా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి,తెలుగులో కూడా సత్తా చాటింది. పూజా బాత్రా 1993లో మిస్ ఇండియా గెల్చుకుని ఓ బాలీవుడ్ మూవీలో కనిపించింది.
ఇక బిగ్ బి అమితాబ్ కోడలు,అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యారాయ్ 1994లో మిస్ వరల్డ్ గెల్చుకుని సినిమాల్లో చేరి సక్సెస్ అందుకుంది. సుస్మితా సేన్ కూడా 1994లో మిస్ ఇండియా గా నిల్చి కొన్ని సినిమాల్లో చేసింది. మోడలింగ్ చేస్తూ లారా దత్తా 2000లో మిస్ ఇండియా అవార్డు సొంతం చేసుకుంది. అవతార్ మూవీతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత మిస్ ఇండియా అవార్డు గెల్చిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో అడుగుపెట్టి ఫుల్ బిజీ అయిపోయింది. 2002లో మిస్ ఇండియా గెలుచుకున్న నేహా పలు సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసింది. తనుశ్రీ దత్తా మిస్ ఇండియా గెల్చుకుని సినిమాలలో మెరిసింది.
అలాగే మిస్ ఇండియా గా నిల్చిన రియా కూడా ఓ బాలీవుడ్ మూవీలో చేసింది. జాఫినా మిస్ శ్రీలంక అవార్డు గెలుచుకుని సినిమాల్లో చేయడానికి రెడీ అయింది. సల్మాన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని టాక్. 17ఏళ్లకే మిస్ ఇండియా అవార్డు గెల్చిన మీనాక్షి శేషాద్రి బాలీవుడ్,టాలీవుడ్ మూవీస్ తో అలరించింది. నమ్రతా శిరోద్కర్ మిస్ ఇండియా అవార్డు గెల్చుకుని బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి,టాలీవుడ్ లో మహేష్ బాబుతో చేసి, అతడినే పెళ్ళాడి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.

