Movies

టాలీవుడ్ యంగ్ హీరోని గుర్తు పట్టారా…అయితే ఆలస్యం చేయకుండా చూసేయండి

కరోనా కష్టకాలంలో అన్ని దెబ్బతిన్నట్టే సినీ రంగం కూడా దెబ్బతింది. ఎన్నో సినిమాలు షూటింగ్ పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. మరిన్ని సినిమాలు మధ్యలో ఆగిపోతే ,ఇంకొన్ని సినిమాలు సెట్స్ దాకా కూడా వెళ్ళలేదు. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో సైతం ఎవరూ ధైర్యంగా ముందుకు కదలడం లేదు. కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడమే ఇందుకు కారణం. ఇక ఖాళీగా ఉన్న స్టార్స్ అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఇవి వైరల్ అవుతున్నాయి.

తాజాగా నేచురల్ స్టార్ నాని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చిన అష్టా చెమ్మాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని తాజాగా ట్రక్ జగదీశ్ మూవీ చేస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్ జోడిగా నటిస్తోంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో ఈ మూవీ వస్తోంది. ఇక మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వస్తున్న ‘వి’మూవీలో నెగెటివ్ షెడ్ పాత్ర చేస్తున్నాడు.

రాధాగోపాళం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో తీసిన ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే ఫాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. అన్నట్టు ప్రొడ్యూసర్ గా కూడా నాని సక్సెస్ అనిపించుకున్నాడు.