Movies

మహేష్ బాబు నో చెప్పిన సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్స్ అయ్యాయో…ఇవి చేసుంటే

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన టాలెంట్ తో సూపర్ స్టార్ గాఎదిగాడు. ఇప్పటికే 26సినిమాలు చేసిన మహేష్ ప్రస్తుతం 27వ సినిమాగా సర్కారు వారి పాట మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లాక్ డౌన్ తో ఆలస్యంగా సెట్స్ మీదికి రాబోతోంది. మహేష్ చేసిన 26సినిమాల్లో బ్లాక్ బస్టర్ గా నిల్చి కెరీర్ ని అమాంతం పెంచిన సినిమాలతో పాటు కెరీర్ దెబ్బతీసిన మూవీస్ కూడా ఉన్నాయి. అయితే 13సినిమాలు చేతిదాకా వస్తే వదిలేసాడు. అందులో విభిన్న అంశాల మూవీస్ ఉండడంతో అవి చేస్తే ఇమేజ్ మరింత పెరిగేది. కానీ వేరేవాళ్లు చేసి ఆ క్రెడిట్ దక్కించుకున్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డి ఆలీతో తీసిన యమలీల మూవీని మహేష్ కోసం రెడీ చేసి వెళ్తే, స్టడీస్ ఉన్నందున ఇప్పుడొద్దని సున్నితంగా కృష్ణ తిరస్కరించారు. నువ్వేకావాలి మూవీ రీమేక్ కోసం దాని మాతృక సీడీని స్రవంతి రవికిశోర్ … మహేష్ కి పంపిస్తే ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇడియట్ మూవీ కోసం రవితేజ కన్నా ముందే నలుగురు హీరోలను కాంటాక్ట్ చేస్తే అందులో మహేష్ ఒకడు. ఇలాంటి పాత్రలో ఆడియన్స్ నన్ను చూడలేరని రిజెక్ట్ చేసాడు. ఇక మనసంతా నువ్వే మూవీ కోసం ఎం ఎస్ రాజు అడిగితె తప్పకుండా వేరే మూవీ చేద్దాం ఇప్పుడు డేట్స్ లేవని చెప్పేసాడు. తెలుగు తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గజినీ మూవీ రీమేక్ కోసం 7గురి హీరోల చుట్టూ తిరిగింది. అయితే మహేష్ ఆ క్యారెక్టర్ చేయలేనని చెప్పేసాడు. ఇక డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ అయింది.

మహేష్ కోసం లీడర్ మూవీ రెడీ చేస్తే, కొంచెం కమర్షియల్ హంగులు యాడ్ చేయమని సూచించాడట. కానీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆ రూట్ లోకి వెళ్లలేక పోయాడు. మహేష్ కోసం గౌతమ్ మీనన్ ఏం మాయచేసావే మూవీ తయారుచేస్తే,ఖలేజా షూటింగ్ లో బిజీ గా ఉండడంతో స్టోరీ కూడా వినకుండా రిజెక్ట్ చేసేసాడు. ఇక రుద్రమదేవి లో గోన గన్నారెడ్డి పాత్రకు మహేష్ ని అనుకున్నారు. కారణాలు ఏమిటో తెలీదుగానీ అదీ చేజారింది. 24మూవీ లో కొన్ని మార్పులు చేయమని మహేష్ సూచించడం,విక్రమ్ కుమార్ కి ఇష్టం లేకపోవడంతో హీరో సూర్య చేసాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అ ఆ మూవీని మహేష్ కోసం రాయడం,నచ్చడం అయ్యాయి కానీ డేట్స్ కుదరక వదులుకున్నాడు. లీడర్ కుదరకపోవడంతో ఫిదా మూవీని వినిపించిన శేఖర్ కమ్ములకు మళ్ళీ నిరాశ ఎదురైంది. డేట్స్ వలన వదిలేసిన ఈ మూవీ వరుణ్ తేజ్ కెరీర్ ని మలుపు తిప్పింది. అలాగే విక్రమ్ కుమార్ ముందుగా గ్యాంగ్ లీడర్ కథను మహేష్ కి చెబితే ,రిజెక్ట్ చేసాడు. ఇక మహేష్ ని డిఫరెంట్ గా చూపించాలని పుష్ప మూవీ ఏడాదిపాటు సుకుమార్ కష్టపడి తయారుచేసాడు. కానీ క్యారెక్టర్ చేంజ్ చేస్తే చేద్దామనడంతో బన్నీ దగ్గరకు వెళ్ళిపోయింది.