Kitchen

పండ్లు, కూరగాయలను శానిటైజ్ చేస్తున్నారా…అయితే ఇది చూడండి

కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారు. బయట తెచ్చిన ఒకటికి రెండు సార్లు కడిగి శానిటైజ్ చేస్తున్నారు. కూరగాయలను,పండ్లను కూడా ఇలానే శానిటైజ్ చేసేస్తున్నారు. ఇలా కూరలను,పండ్లను శానిటైజ్ ఎక్కువగా చేయవచ్చా అనే సందేహం చాలా మందిలో వస్తుంది.

పండ్లు, కూరగాయలపైమా శానిటైజర్‌ స్ప్రే చేస్తే అందులోని ఆల్కహాల్‌ ప్రభావానికి పండ్లు, కాయగూరల్లోని పోషకాలు తగ్గిపోతాయని, ఇలా శానిటైజర్ వాడకుండా ఉప్పు నీటిలో వేసి కడగాలని నిపుణులు సూచిస్తున్నారు.

శుభ్రత పేరుతొ కొంత మంది డిటర్జెంట్‌ కలిపిన నీటిలో కడుగుతున్నారని,మరికొందరు రసాయనాలు, ఆల్కహాల్ ఉన్న నీటిలో శుభ్రపరుస్తున్నారని దాని వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. చేస్తే ఒక సమస్య చేయకపోతే మరొక సమస్య అని ఎంతోమంది అనుకుంటున్నారు.