Movies

సొంత విమానాలు ఉన్న టాలీవుడ్ హీరోలు… ఎక్కువ ధర ఎవరిదో చూడండి

టాలీవుడ్ ట్రెండ్ గతం కన్నా భిన్నంగా వచ్చేసింది. ఒకప్పుడు కారు ఉంటె గొప్ప. ఎందుకంటే అలనాటి ఎన్టీఆర్,ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి రవితేజ వరకూ చాలామంది కెరీర్ మొదట్లో చాలా కష్టాలు ,ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు చాలామంది వారసత్వంగా వచ్చినవాళ్లే. అందుకే ఖరీదైన కార్లు,బైక్స్, వాచీలు,ఇలా ఎన్నింటిపైనో ఇష్టం పెంచుకుని వాటిని దరిచేర్చుకుంటున్నారు.

ఒక్కో స్టార్ హీరో విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. 50లక్షల పైనే విలువగల కార్లు వాడుతున్నారు. అందునా ఒకటి రెండు కాదు నాలుగైదు కార్లు వాడుతున్నారు కూడా. దీనికి తోడు లక్షల విలువచేసే రకరకాల బైక్స్ ఉంటున్నాయి. కార్లు అనుకుంటే,పొరపాటే కొందరి హీరోలకు సొంత విమానాలు కూడా వున్నాయి. వీటిని తమకు దగ్గరలో గల విమానాశ్రయాల్లో ఉంచి,మెయింటినెన్స్ కింద ప్రతినెలా ఎయిర్ పోర్టుకి చెల్లిస్తున్నారు. ఒకప్పుడు ఎన్నో కష్టాలు చూసిన చిరు ఇప్పుడు తమ పిల్లలకు విలాసవంతమైన జీవితం ఇచ్చారు. రామ్ చరణ్ కి పుట్టినరోజు సందర్బంగా మూడు కోట్ల విలువచేసే ఆడి కారు కొనిచ్చారట.

ఇక చెర్రీ 50నుంచి 80కోట్ల విలువచేసే ఓ జెట్ ఫ్లయిట్ కూడా కొనుగోలు చేసాడు. అలాగే ఎన్నో హిట్ సినిమాలు తీసిన అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ కూడా ఓ జెట్ ఫ్లయిట్ కొన్నట్లు తెలుస్తోంది. జెట్ ఫ్లయిట్ గల ఫ్యామిలీలో కింగ్ నాగార్జున కూడా ఉన్నాడు. ఫ్యామిలీతో ఎక్కడికైనా టూర్ కి వెళ్ళడానికి వీలుగా విమాన సౌకర్యం సమకూర్చుకున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఇటీవల 80కోట్లతో ప్రయివేట్ జెట్ ఫ్లయిట్ కొన్నట్లు టాక్. హీరోలకే కాదు ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న పూజ హెగ్డే కు కూడా ఫ్లయిట్ ఉందట. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఒక్క ఫోన్ కాల్ తో విమానం రెడీ చేయించుకుని వెళ్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."