రష్మిక మందన కెరీర్ లో ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుసా ?

‘ఛలో’మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. గీత గోవిందం లాంటి సినిమాలతో తన సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ వరుస హిట్స్ తో దూసుకెళ్తూ.. మొన్న సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ మూవీతో హిట్ అందుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడికి అనుగుణంగా రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటోంది. ఇప్పటిదాకా 10సిని మాలు చేసి అన్నీ హిట్ కొట్టేసింది. బ్లాక్ బస్టర్ 2, సూపర్ హిట్స్ 7,ఏవరేజ్ 1గా నిలిచాయి.

ఈ ముద్దుగుమ్మ తక్కువ సినిమాలు చేసినా నటనలో ఎంతో మెచ్యూరిటీ సాధించింది. అందం ,అభినయం మెండుగానే ఉన్నాయి. కన్నడలో కిరాక్ పార్టీ ద్వారా 2016లో వెండితెరపై మెరిసిన రష్మిక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎన్నో కన్నడ మూవీస్ చేసింది. తెలుగులో అయితే వందకోట్ల క్లబ్ లో చేరిన సినిమాల్లో చేసింది. 2017లో అంజనీ పుత్ర పేరిట కన్నడలో చేసిన మూవీ హిట్ కొట్టింది. అదే ఏడాది చమక్ అనే కన్నడ మూవీ తో కూడా మంచి పేరు తెచ్చుకుంది.

ఇక తెలుగులో ఛలో మూవీతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకుంది. ఇక 2018లో గీత గోవిందంలో గీతగా నటించి 120కోట్లు వసూలు చేసి స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరింది. 2018లో నాగార్జున ,నాని నటించిన దేవదాస్ లో చేసి,ఎబో ఏవరేజ్ గా నిల్చింది. 2019లో యజమాన్ అనే మూవీ కన్నడంలో చేసి హిట్ కొట్టింది. తెలుగులో డియర్ కామ్రేడ్ ప్లాప్ అయినా,ఈ అమ్మడికి మంచి పేరే వచ్చింది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబుతో జోడీ కట్టి బ్లాక్ బస్టర్ కొట్టింది. అలాగే నితిన్ తో కల్సి చేసిన భీష్మ కూడా మంచి హిట్ అందుకుంది.