స్వయంకృషి మూవీ వెనుక అసలు కథ… ఈ నమ్మలేని నిజాలు మీ కోసమే
మెగాస్టార్ గా మంచి మాస్ ఇమేజ్ తో దూసుకుపోతున్న చిరంజీవిని సాఫ్ట్ నేచర్ లో అది కూడా ఓ చెప్పులు కుట్టేవాడి పాత్రలతో ఒదిగిపోయేలా కళాతపస్వి కె విశ్వనాధ్ చేసారు. జీవితంలో ఏదో ఒక సమయంలో నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతారు. అలాంటి సమయంలో స్ఫూర్తినిచ్చే సినిమా ఇది. మనకి మనం స్ఫూర్తి పొందాలి,లేదా పుస్తకం ద్వారా అయినా పొందాలి. కానీ విశ్వనాధ్ సినిమాలే మంచి పుస్తకాల్లాంటివి. కెరీర్ పరంగానే కాదు, మానవ సంబంధాల విషయం లో కూడా ఈయన సినిమాలు స్ఫూర్తినిస్తాయి. అందుకే ఆయన రూపొందించిన కథకు హీరో సొంతంగా ఎదిగిన ప్రస్తుత తరం హీరో కావాలని భావించి, సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవిని అనుకున్నారు. ఎందుకంటే స్వయంకృషితో ఎదిగిన హీరో అప్పట్లో ఆయనే. ఇక చిరు కూడా ఒకే.
కథను జంధ్యాల చేతికి ఇచ్చేయడంతో హాస్యం,ఎమోషన్ మేళవించిన డైలాగ్స్ రాసారు. ఇక ఏడిద నాగేశ్వరరావు నిర్మాత. ఇందులో హీరో చిరంజీవి చెప్పులు కుడుతూ ,రేడియోలో హిందీ పాటలు వింటూ,చనిపోయిన చెల్లెలు కొడుకుని పెంచుకుంటూ,పెద్ద షూ షోరూం పెట్టేస్తాయికి ఎదగాలని కలలు కనే సాధారణ మనిషి. సినిమా స్టార్టింగ్ లోనే సాంబయ్య పాత్రతో చెప్పులు కుట్టగా వచ్చిన డబ్బులు లెక్కపెడుతూ కలలోకి జారుకుంటాడు. కలలో అతడు షూ షోరూం లో చెప్పులు సర్దుతూ కనిపిస్తాడు. అలా ఒక్క షాట్ లోనే విశ్వనాధ్ ఏమి చెప్పాలో అదే చెప్పేసారు. మరో పాత్ర గంగ గా విజయశాంతి నటన కూడా చిరంజీవి కి సరిజోడీగా ప్రేమానురాగాలు,ఎమోషనల్ సీన్స్ పండిస్తూ అదిరింది.సాంబయ్య పడేకష్టంలో గంగ తోడుగా నిలుస్తుంది.
మరదలిని సాంబయ్య ప్రేమిస్తే, ఆమె మరొకర్ని ప్రేమిస్తుంది. ఇక తాను ఎదుగుతూ తనతో ఉన్న పదిమంది ఎదగాలని సాంబయ్య కోరుకుంటాడు. కిందపడ్డప్పుడు ఎలా లేవాలో ఈ సినిమా చూపించింది. తాను ఎదిగిన తర్వాత తన మేనల్లుడు కూడా కష్టపడి ఎలా ఎదగాలో నేర్పించే క్రమంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించే సాంబయ్య పాత్రలో చిరంజీవి ఒదిగిపోయాడు. మంచి ఆకర్షించడం కష్టమని,చెడుని చేరుకోవడం ఎంతసులువో చక్కగా చూపిస్తూ, మంచికోసం పడే తపనను ఆవిష్కరించారు. మేనల్లుడు తనని విభేదించి వెళ్ళిపోతే కోపం వచ్చిన సాంబయ్య తన షూమార్ట్ కి వెళ్లి … చెప్పు కుట్టడం చేస్తాడు.
ఆ సమయంలో బ్యాక్ డ్రాప్ లో శివతాండవం కనిపిస్తుంది. ఆస్తిమొత్తం చిన్న పిల్లాడి పేరున రాసేసి,మళ్ళీ చెప్పులు కుట్టుకోడానికి చెట్టుకిందకి వెళ్లిపోవడం ద్వారా తమ మూలలను మర్చిపోలేదని చాటిచెప్పారు. శ్రమలోని ఔనత్యాన్ని ఈ చిత్రం ద్వారా విశ్వనాధ్ ఆవిష్కరించారు. అందుకే ఇన్ని అంశాల సమన్వయంగా తీసిన ఈ సినిమాలో స్వయంకృషిని ఆవిష్కరించిన చిరంజీవికి తొలిసారి నంది అవార్డు తెచ్చిపెట్టింది. తన జీవితంలో ఒక్క సినిమా అయినా కె విశ్వనాధ్ డైరెక్షన్ లో చేయాలని హృతిక్ రోషన్ ఓ ఇంటర్యూలో చెప్పడం చూస్తే, విశ్వనాధ్ గొప్పతనం మనకు తెలుస్తుంది.

