Movies

ప్రభాస్ ‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్ ఖర్చు తెలిస్తే షాకవ్వాలి…అంత నమ్మకమా ?

తానాజీ చిత్ర దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని ఇటీవల వెల్లడించాడు. విజువల్ వండర్ గా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్ను సైతం ప్రభాస్ విడుదల చేశాడు. ‘ఆదిపురుష్’ పేరుతో రానున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందనున్నట్లు పోస్టర్లో వెల్లడించారు.

దాదాపు 500కోట్ల రూపాయలతో అంత్యంత భారీగా నిర్మించే ఈ మూవీలో కేవలం గ్రాఫిక్స్ కోసమే ఏకంగా 250కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు టాక్. ఇప్పటివరకూ ఏ ఇండియన్ మూవీలో కూడా ఇంత భారీగా గ్రాఫిక్స్ కి ఖర్చుచేసిన దాఖలాలు లేవన్న మాట వినిపిస్తోంది. కేవలం ప్రకటనలు చూసాక ఈ మూవీ ఎంత త్వరగా చూసేద్దామా అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

గుల్షన్ కుమార్, టి–సిరీస్ల సమర్పించే ఈ చిత్రానికి మొత్తం ఐదుగురు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. భూషణ్కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్ కావడం విశేషం. హీరోయిన్,ఇతర తారాగణం ఎంపిక అయ్యాక ఈ మూవీ సెట్స్ మీదికి రానుంది.