Movies

మెగాస్టార్ చిరంజీవి వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు

టాలీవుడ్ లో స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి రాజకీయాల్లోంచి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాక కూడా సత్తా చాటుతున్నాడు. ఖైదీ నెంబర్ 150, సైరా మూవీస్ హిట్ అయ్యాయి. తాజాగా కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే. కరోనా కారణంగా షూటింగ్ ఆగింది. అయితే చిరంజీవి కెరీర్ టాప్ రేంజ్ లో ఉన్నప్పుడే కొన్ని సినిమాలు వదులుకోగా, కొన్ని షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. దివ్యభారతి,మరో హీరోయిన్ తో కల్సి చిరు హీరోగా కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో ఇద్దరు పెళ్ళాల మొగుడు మూవీ ప్లాన్ చేసారు. అయితే క్లైమాక్స్ స్క్రిప్ట్ కుదరకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయింది.

అలాగే శ్రీదేవి హీరోయిన్ గా చిరు హీరోగా వజ్రాల దొంగ అనే మూవీని కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీదేవి నిర్మించాలన్న ఈమూవీ ఎందుకో ఆగిపోయింది. మనసంతా నువ్వే లాంటి సినిమాలు చేసిన వి ఎన్ ఆదిత్య తో చిరు ఒక సినిమా చేయాలనుకున్నా ఎందుకో అదీ ఆగిపోయింది. ఇక సురేష్ కృష్ణ డైరెక్షన్ లో చిరు హీరోగా బాగ్దాద్ గజదొంగ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి,మధ్యలోనే ఆపేసారు. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వినాలని ఉంది పేరుతొ చిరు హీరోగా స్టార్ట్ చేసిన మూవీ ఆగిపోయింది.

సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో చిరు హీరోగా భూలోక వీరుడు పేరిట ఓ జానపద చిత్రం షూటింగ్ మొదలై ఎందుకో ఆగిపోయింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఆంధ్రావాలా మూవీ చిరు చేయాల్సి ఉంది. కానీ రిజెక్ట్ చేసాడు. తర్వాత ఈ సినిమా చేయకపోవడం మంచిదని తేలింది. అలాగే పూరి కాంబోలో మరో మూవీ ప్లాన్ చేసిన అదీ కుదరలేదు. అంతేకాదు వడ్డికాసుల వాడు అనే మూవీ కూడా మెగాస్టార్ చేయాల్సి ఉన్నప్పటికి అది కూడా ఎందుకో నిల్చిపోయింది.