Movies

చెన్నకేశవ రెడ్డి సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

బ్లాక్ బస్టర్ కాకపోయినా ఫాన్స్ గర్వంగా చెప్పుకునే సినిమా చెన్నకేశవరెడ్డి. ఫాన్స్ తొడగొట్టేలా చేసిన మూవీ ఇది. బాలయ్య హీరోగా 2002లో వచ్చిన ఈ మూవీకి వివి వినాయక్ డైరెక్షన్ చేసాడు. సమరసింహారెడ్డితో ఫ్యాక్షన్ డ్రాప్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య నరసింహనాయుడు మూవీతో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. తర్వాత సీమ సింహం లాంటి యావరేజ్ ఫిలిం ఇచ్చారు. అయితే ఫ్యాక్షన్ మూవీకి డిఫరెంట్ గా మేజర్ కాన్సెప్ట్ తో వి సముద్ర డైరక్షన్ లో ఓ సినిమా బాలయ్య స్టార్ట్ చేసాడు. ఈలోగా జూనియర్ ఎన్టీఆర్ ఆది,చిరంజీవి ఇంద్ర చేయడంతో అలాంటి మూవీ చేద్దామని బి గోపాల్ ని బాలయ్య సంప్రదించాడు. నందీశ్వరుడు పేరుతొ జూన్ 10న బాలయ్య పుట్టినరోజున ప్రారంభించి సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ ప్లాన్.

ఈ మూవీ ప్రారంభం కాగానే ఆదితో హిట్ కొట్టిన వివి వినాయక్ ని పిలిచి కథ చూడమని బాలయ్య చెప్పడంతో అప్పటికే దిల్ మూవీ చేయాలనుకున్న వినాయక్ వెంటనే బాలయ్య మూవీ కోసం కసరత్తు మొదలుపెట్టాడు. తీహార్ జైలులో ఎంట్రన్స్ వంటి సీన్స్ చెప్పడంతో పరుచూరి బ్రదర్స్ ని వర్క్ చేయమన్నారు. అలా పరుచూరి బ్రదర్స్ మాటలు రాయడంతో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా చెన్నకేశవరెడ్డి మొదలు పెట్టడానికి వీలుగా , గోపాల్ మూవీ వాయిదా వేశారు.

బాలయ్య డ్యూయల్ రోల్ కావడంతో ఒక రోల్ పక్కన సంతోషం మూవీ హీరోయిన్ శ్రేయాను ఒక హీరోయిన్ గా తీసుకున్నారు. పెద్ద బాలయ్య పక్కన సౌందర్యను అనుకున్నా డేట్స్ కుదరక టబు సెలెక్ట్. 2002మే25నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్. హైదరాబాద్ లో స్టూడియోస్ పాటు అవుట్ డోర్ కూడా చేసారు. కర్నూల్ లో షూటింగ్ సమయంలో జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈలోగా ఇంద్ర రావడం ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో చెన్నకేశవరెడ్డిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఒత్తిడి పెరగడంతో నెలముందే షూటింగ్ పూర్తయింది. 9కోట్ల బడ్జెట్. చంద్రబాబు సమక్షంలో ఆడియో కేసెట్ రిలీజవ్వడంతో సెప్టెంబర్ 25న మూవీ . 250ప్రింట్స్ తో భారీగా రిలీజయింది. మూడు ఏళ్ళల్లో2 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బాలయ్యకు వినాయక్ కి ఇండస్ట్రీ హిట్ వచ్చింది. ప్రతి థియేటర్ దగ్గర పండుగ వాతావరణం ఏర్పడింది. టాటా సుమోల ర్యాలీలు. పొట్టేళ్ల బలి ఇవ్వడం లాంటి హంగామా నడిచిందని టాక్.

చెన్నకేశవరెడ్డి క్యారెక్టర్ దుమ్మురేపింది. బాలయ్య రౌద్ర నటన ఈలలు వేయించింది. టబు యాక్టింగ్ పర్వాలేదు, శ్రేయ గ్లామర్ అదిరింది. చెల్లెలు దేవయాని ఒకే ఒక్క సీన్ తో చప్పట్లు కొట్టించింది. మణిశర్మ మ్యూజిక్ సూపర్భ్ . రిలీజైన కొన్నాళ్ళకు తెలుపు తెలుపు అనే సాంగ్ కలిపారు. మొదటి వారం 7కోట్ల షేర్. 140సెంటర్స్ లో 50రోజులు, 42సెంటర్స్ లో 100రోజులు ఆడింది. 14కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ అనంతపురంలో 11కేంద్రాల్లో 100రోజులు ఆడింది. హడావిడి లేకుండా ఈ సినిమా తీసి ఉంటె ఇండస్ట్రీ హిట్ అయ్యేది..