Movies

పెళ్ళికి రెడీ అయినా శర్వానంద్…ఎవరిని చేసుకుంటున్నాడో తెలుసా ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటిదాకా చాలామంది యంగ్ హీరోలకు పెళ్లి కావాల్సి ఉంది. ప్రభాస్ మొదలుకుని చాలామంది పెళ్లి జాబితాలో ఉండేవారు. అయితే ఒక్కొక్కరు పెళ్లి చేసుకుంటున్నారు. మొత్తానికి 2020 కరోనాతో ఇబ్బందులు పెట్టినా మన హీరోలకు మాత్రం పెళ్లి టైమ్ తెచ్చేందన్న మాట విన్పిస్తోంది. అందుకే ఒకరి తర్వాత ఒకరు ఈ ఏడాది అంతా ఓ ఇంటి వాళ్లు అయిపోతున్నారు. ఇప్పటికే కరోనా సమయంలో కూడా నితిన్, నిఖిల్, రానా లాంటి వాళ్లు పరిమిత జనం మధ్య పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇంకా చాలా మంది లైన్‌లో ఉన్నారు. ఇక మెగా డాటర్ నిహారిక పెళ్లి కూడా కుదిరి,నిశ్చితార్ధం కూడా అయింది.

సాయి ధరమ్ తేజ్ కూడా తనకు పెళ్లి సెట్ అవుతుందని సింబాలిక్‌గా చెప్పేసాడు. ఇప్పుడు 34 ఏళ్ల వయసొచ్చిన హీరో శర్వానంద్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. శతమానం భవతి వంటి మూవీస్ తో హిట్ మీద హిట్ అందుకుంటున్న ఈ హీరో నటించిన సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది. ఈనేపధ్యంలో ఇతడి పెళ్లి విషయంపై మాత్రం అప్పుడే టాలీవుడ్‌లో ఊహాగానాలు జోరందుకున్నాయి.

తన చిన్న‌నాటి స్నేహితురాలు, మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. వీళ్ల ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాలు త్వరలోనే ముహూర్తం పెట్టున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చేసాయి. చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయితోనే ఏడడుగులు వేయబోతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె మంచి బిజినెస్ ఉమెన్ గా రాణిస్తోందట. శర్వానంద్ ఇప్పటికే ప్రేమ విషయం కూడా ఇంట్లో చెప్పి ఒప్పించాడని వార్తలు వినిపిస్తున్నాయి.