డైరెక్టర్స్ హ్యాండ్ ఇచ్చిన హీరోలు ఎంతమంది ఉన్నారో చూడండి
చిత్ర పరిశ్రమ అంటేనే వింతవింతగా ఉంటుంది. ఎప్పుడు ఏది ఎలా మారుతుందో తెలీదు. దర్శకులకు హ్యాండిచ్చే హీరోలు,.. హీరోలకు హ్యాండిచ్చే నిర్మాతలు,..ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. రాజకీయాల్లోంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆటో జానీ పేరుతొ పూరి జగన్నాధ్ తో సినిమా చేయాలని నిర్ణయించి సెకండాఫ్ బాగోలేదన్న సాకుతో క్యాన్సిల్ చేసేసాడు. అయితే వినాయక్ డైరెక్షన్ లో కత్తి రీమేక్ గా ఖైదీ నెంబర్ 150చేసిన చిరు బ్లాక్ బస్టర్ కొట్టాడు. సోగ్గాడే చిన్ని నాయనే మూవీతో హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణతో మరో మూవీగా బంగార్రాజు మూవీ చేస్తానని మాటిచ్చాడు నాగ్. దానికి కళ్యాణ్ కూడా స్క్రిప్ట్ రెడీ చేయగా, ఈలోగా మరో చిత్రానికి నాగ్ కమిట్ అయ్యాడు. దీంతో కళ్యాణ్ కి నాగ్ హ్యాండిచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మహర్షి మూవీతో హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లికి మహేష్ హ్యాండిచ్చాడు. సరిలేరు నీకెవ్వరూ మూవీ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తానని చెప్పి పరశురామ్ డైరెక్షన్ లో మూవీకి ఫిక్స్ అయ్యాడు. దీంతో వంశీ మరో మూవీ వెతుకున్నే పనిలో పడ్డాడు. అంతకుముందు సుకుమార్ తో కూడా మూవీ చేస్తానని మహేష్ మాటిచ్చి హ్యాండిచ్చాడు. అలాగే పూరి జగన్నాధ్ తో చేయాలని భావించి కథ కుదరలేదని మహేష్ క్యాన్సిల్ చేసేసాడు. సంతోష్ శ్రీనివాస్ తో మూవీ చేస్తానని చెప్పిన రవితేజ హ్యాండ్ ఇచ్చాడు. దీంతో గోపీచంద్ తో క్రాక్ మూవీ సంతోష్ చేస్తున్నాడు. కన్నడంలో కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ తో కల్సి ప్రభాస్ ఓ సినిమా కి కమిట్ అయ్యాడు.
కానీ ఇంతవరకూ ఒకే చేయలేదు సరికదా వేరే ప్రాజెక్ట్ లకు ఒకే చేసేస్తున్నాడు. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలు పూర్తవ్వాలంటే మూడేళ్లు పడుతుంది. దీంతో ప్రశాంత్ నీల్ తో మూవీ ఇప్పట్లో లేనట్టే. ఇక బన్నీ కూడా బాగానే హ్యాండిచ్చాడు. వేణు శ్రీరామ్ తో మూవీ చేస్తానని మాటిచ్చి ఇప్పుడు పక్కన పెట్టేసాడు. అయితే పవన్ తో వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ చేస్తున్నాడు. ఇక తారక్ అయితే వక్కంతం వంశీని డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తానని మాటిచ్చాడు.
కానీ స్క్రిప్ట్ ఒకే కాలేదని వక్కంతం ని పక్కన పెట్టేసాడు. దీంతో నాపేరు సూర్య నా ఊరు ఇండియా మూవీని బన్నీతో వక్కంతం చేసి పరాజయం పాలయ్యాడు. అయితే హీరోలకు కూడా హ్యాండిచ్చిన డైరెక్టర్స్ ఉన్నారు. నాగచైతన్యతో మూవీ చేస్తానని చెప్పిన పరశురామ్ .. మహేష్ పిలుపుతో అటు వెళ్ళిపోయి హ్యాండిచ్చాడు. అలాగే వెంకీతో మూవీ చేస్తానన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ,.. పవన్ తో అజ్ఞాతవాసి చేసాడు. అలా వెంకీకి హ్యాండిచ్చాడు. అలాగే ఆచార్య తర్వాత రామ్ చరణ్ తో కొరటాల శివ మూవీ ఉంటుందని ప్రకటించి,ఇప్పుడు బన్నీతో చేయాలన్న నిర్ణయించాడు.

