Movies

ఈ స్టార్స్ మరణం ఇప్పటికి మిస్టరీనే…?

అది టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా,చివరకు హాలీవుడ్ అయినా సరే కొందరు స్టార్స్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. కథలు కథలుగా ఎన్నో వినిపిస్తుంటాయి గానీ,నిజం బయటకు తెలీదు. ముందుగా హాలీవుడ్ శృంగార దేవత మార్లిన్ మన్రో గురించి ప్రస్తావిస్తే, .. 1962లో మరణించింది. ఆమె మరణానికి ఇప్పటికీ స్పష్టమైన కారణం రాలేదు. ఆత్మహత్య అని, కాదు హత్యే అనేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన గురు దత్ నిద్రమాత్రలు అధికంగా వేసుకుని, ఆల్కహాల్ సేవించడంలో 1964, అక్టోబర్ 10న చనిపోయాడు.

అయితే అది కావాలని చేశారా, ఆత్మహత్య అనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీలేదు. అంతేకాదు, సెన్సేషనల్ హీరో బ్రూస్లీ 1973, జులై 20న ఈయన చనిపోయాడు. ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేసారు అని ఇప్పటికీ ప్రచారం ఉంది. ఇక ఇండియన్ స్క్రీన్ పై సంచలన హీరోయిన్‌గా వచ్చిన దివ్య భారతి కేవలం 19 ఏళ్లకే అంటే, 1993 ఎప్రిల్ 5న మరణించింది. దివ్యను హత్య చేసారని కొందరు, మాత్రం ప్రమాదవశాత్తూ చనిపోయిందని మరికొందరి టాక్.

ఇక వాంప్ పాత్రల్లో ఆరితేరిన సిల్క్ స్మిత 1996 డిసెంబర్ 23న చెన్నైలోని తన సొంతింట్లోనే చనిపోయింది. ఈమె మరణానికి కెరీర్ సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు కారణం అని టాక్. అయితే కొందరు మాత్రం అనుమానాలు కూడా వ్యక్తం చేసారు. కాగా ప్రియా రాజవంశ్ 2000 మార్చి 27 న మరణించింది. అయితే ఈమె మరణంపై స్పష్టత లేదు.

తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా అప్పుడప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న తెలుగమ్మాయి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23 న చనిపోయింది. ఈమె మరణం ఇప్పటికీ మిస్టరీనే. బాలీవుడ్ సీనియర్ నటి పర్వీన్ బాబీ కూడా 2005 జనవరి 20 న తన ఇంట్లోనే అనుమానాస్పద మరణించింది. మూడు రోజుల తర్వాత ఆమె శవాన్ని చూసారు. ఇప్పటికీ నిజం బయటకు రాలేదు.

బాలీవుడ్ మోడల్ నసీఫా జోసెఫ్ మరణం వెనుక కారణం కాబోయే భర్త అనే అనుమానం ఉన్నా, ఇంకా తేలలేదు. నిశ్శబ్ధ్, గజిని, హౌజ్ ఫుల్ లాంటి సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జియా ఖాన్ 2013 జూన్ 3న తన ఇంట్లోనే చనిపోయింది. అయితే ఈమె మరణం వెనక బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలీ ఉన్నాడంటూ ఇప్పటికీ ఈమె తల్లి న్యాయం కోసం పోరాడుతోంది.

ఇక తెలుగు,హిందీ భాషల్లో తిరుగులేని హీరోయిన్ గా నిల్చిన శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని ఓ పెళ్లికి వెళ్లి అక్కడే కన్నుమూసింది. గుండెపోటు నుంచి మొదలై శ్రీదేవి మరణానికి చాలా కారణాలు చెప్పారు. ఇప్పటికీ నిజమేమిటో తెలీదు. ఇక తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత జూన్ 14న చనిపోయి మూడు నెలలు కావొస్తున్నా ఇంకా క్లారిటీలేదు. ఆత్మహత్య అని చెప్తున్నా కూడా సిబిఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనుమానాలు బలపడుతున్నాయి.