రకుల్ స్టార్ హీరోయిన్ అవటానికి ఆ వస్తువే కారణమట… ఏమిటో తెలుసా?

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ చేరింది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఆ తర్వాత స్టార్ హీరోలతో జోడి కట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఒకపక్క సినిమాల్లో నటిస్తూ మరోపక్క బిజినెస్ లో కూడా దూసుకుపోతోంది. రకుల్ ప్రీత్ సింగ్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కటానికి ఒక వస్తువు కారణమట.

ఆ వస్తువు ఏమిటంటే కనకపుష్యరాగం ఉంగరం. ఈ ఉంగరం పెట్టుకున్నాక బాగా కలిసొచ్చింది. ఇలా సెంట్ మెంట్ లు అనేవి సినీ పరిశ్రమలో కామనే. ఈ సెంటిమెంట్ గురించి కొందరు చెబుతారు కొందరు చెప్పరు అంతే. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా చెప్పింది. ప్రస్తుతం షూటింగ్ లు ఏమి జరగడం లేదు కదా… అందుకే స్టార్స్ అందరూ ఇలా అభిమానులతో ముచ్చటిస్తూ టచ్లో ఉంటున్నారు.