Movies

జబర్దస్త్ నరేష్ ఈ స్థాయికి రావటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిస్తే అయ్యో పాపం అంటారు

భగవంతుడు ఒక లోపం పెట్టినా , ఒక టాలెంట్ ఇస్తాడు. సరిగ్గా జబర్దస్త్ లో నాటీ నరేష్ విషయంలో అదే జరిగింది. నాటీ నరేష్ 20 ఏళ్ల కుర్రాడు కానీ చూడ్డానికి మాత్రం ఐదేళ్ల పిల్లాడిలా ఉంటాడు. జన్యులోపంతో అలా ఉండిపోయాడు. అయితే అలా ఎదగకుండా ఉన్న లోపమే ఇప్పుడు అతడికి కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం నరేష్ కెరీర్ మంచి దూకుడు మీదుంది. వరస ఈవెంట్స్ చేస్తూ.. షోలు చేసుకుంటూ.. జబర్దస్త్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రెండు చేతులా సంపాదించుకుంటున్నాడు. ఇంటిని చూసుకుంటున్నాడు.

కరోనా టైమ్‌లో ఓ యూ ట్యూబ్ ఛానెల్‌తో కలిసి నరేష్ తన ‘హోం టూర్’ వీడియో చేశాడు. అందులో భాగంగా తన ఇంట్లో ఉన్న సామాన్లతో పాటు తనకు నటనలో వచ్చిన ట్రోపీలను కూడా చూపించాడు. నటుడికి డబ్బుల కంటే ప్రోత్సాహకంగా వచ్చే ఈ ట్రోఫీలే ఎక్కువ ఆనందాన్నిస్తాయ ని నరేష్ అంటున్నాడు. నిజానికి ‘జబర్దస్త్ కామెడీ షో’ స్టార్ట్ చేసాక ఎంతోమంది ఆణిముత్యాల్లాంటి నటులు బయటికి వచ్చారు. ఇండస్ట్రీలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అందులో నాటీ నరేష్ కూడా ఒకడు.

ఇప్పుడు డబ్బు సంపాదిస్తూ ఎంత హ్యాపీగా ఉన్నా సరే, లైఫ్‌లో కొన్ని చేదు నిజాలు మాత్రం అలాగే గుర్తుండిపోతాయి. నరేష్ జీవితంలో కూడా అలాంటిదే ఒకటి ఉంది. జీవితంలో తొలిసారి అమెరికా ఈవెంట్‌కు వెళ్లే క్రమంలో జరిగిన ఓ విషాద సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. అమెరికా ఈవెంట్‌కు వెళ్లే ముందు తన తాతయ్య చనిపోతే, ఆ సమయంలో అంత్యక్రియల కోసం కనీసం చేతిలో డబ్బులు లేవని,దాంతో బుల్లెట్ భాస్కర్‌ను అప్పు అడిగానని నరేష్ చెప్పాడు. అయితే అమెరికా ఈవెంట్‌కు వెళ్లొచ్చిన తర్వాత ఆ వచ్చిన డబ్బులతో అప్పు తీర్చినట్లు నరేష్ చెప్పాడు. తాత చనిపోయిన పుడు చేతిలో డబ్బులు లేకపోవడం.. ఆ సమయంలో భాస్కర్ ఆదుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనిదని అంటున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."