Movies

‘రాంబంటు’ సినిమాలోని ఈ పాప ఎవరో తెలుసా??? ఆమె ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు చిన్నప్పుడు నటించడమే కాదు,పెద్దయ్యాక హీరో హీరోయిన్స్ ,స్టార్స్ గా రాణిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా రాంబంటు సినిమాలో పాప గా నటించిన చైల్డ్ ఆర్టిస్టు గురించి ప్రస్తావించాలి. తరతరాలుగా సినిమా రంగంలో రాణిస్తున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈమె ఐశ్వర్య రాజేష్. తమిళ ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేస్తోంది.

తెలుగు,తమిళ భాషల్లో దాదాపు పాతిక సినిమాల్లో చేసిన ఐశ్వర్య రాజేష్ గురించి ప్రస్తావిస్తే,ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. అప్పట్లో మల్లెమొగ్గలు,రెండుజెళ్ళ సీత,ఆనంద భైరవి తదితర సినిమాల్లో నటించిన రాజేష్ కూతురే ఐశ్వర్య రాజేష్. అప్పట్లో రాజేష్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేసాడు. అయితే హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఐశ్వర్య రాజేష్ మేనత్త టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ శ్రీలక్ష్మి. ఈమె ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. ఆరోజుల్లో శ్రీలక్ష్మి లేని మూవీ లేదంటే ఆశ్చర్యమే.

తండ్రి చిన్నప్పుడే ఉన్నదంతా పోగొట్టుకుని పోవడంతో ,ఎన్నో కష్టాలు పడుతూ ఐశ్వర్య రాజేష్ ఎదుగుతూ వచ్చింది. శైలజా కృష్ణమూర్తి మూవీతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్ చిన్నప్పుడు బాపు డైరెక్షన్ లో వచ్చిన రాంబంటు మూవీలో చేసింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ హీరో. ఒక పాటలో బాలనటిగా కనిపిస్తుంది. పెద్దయ్యాక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మళ్ళీ అదే హీరో పక్కన కూతురిగా శైలజా కృష్ణమూర్తి మూవీలో నటించడం యాదృచ్ఛికమే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."