Movies

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరో తెలుసా ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలున్నా అందులో అగ్ర హీరో ఒక్కరే ఉంటారు. ఒకప్పుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఇండస్ట్రీని అగ్ర హీరోగా ఏలారు. ఆతర్వాత సూపర్ స్టార్ కృష్ణ కొన్నాళ్ళు అగ్ర హీరోగా వెలిగాడు. ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో నెంబర్ వన్ గా కొనసాగాడు. ఇక ఈ జనరేషన్ లో పవన్ కళ్యాణ్,జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్,ప్రభాస్ ఇలా వీళ్లంతా వరుస హిట్స్ తో పాటు మంచి మార్కెట్ కూడా కలిగి ఉన్నారు. పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు.అయితే చిరంజీవి రాజకీయాల నుంచి 9ఏళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి వచ్చి ఖైదీ నెంబర్ 150తో తడాఖా చూపించాడు. ప్రస్తుతం ఆచార్య మూవీ కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్నాడు.

అజ్ఞాతవాసి తర్వాత ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నా ,మళ్ళీ ఈమధ్య ఎంటరయ్యాడు. హిందీ పింక్ మూవీకి రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ లో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా చివరిదశలో ఆగింది. అది కాక మరో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. మెగాస్టార్ బ్రదర్స్ ని పక్కన పెడితే మిగిలిన వాళ్ళల్లో నెంబర్ వన్ ఎవరో చూద్దాం. బాహుబలి మూవీతో ప్రభాస్ రేంజ్ తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం రాధేశ్యాం,ఆదిపురుష్ వంటి సినిమాల్లో చేస్తున్నాడు. అగ్ర హీరోల్లో ఒకడిగా ఉన్న ప్రభాస్ ని రాజమౌళి తన సినిమాతో వరల్డ్ వైడ్ చేసాడు. 5ఏళ్లపాటు శ్రమించి చేసిన బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అలాగే సాహో మూవీ కూడా పాన్ ఇండియాగానే వచ్చింది.

మార్కెట్,క్రేజ్ పరంగా నెంబర్ వన్ అని చెప్పవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కూడా తన ఇమేజ్ తో సూపర్ స్టార్ గా ఎదిగి తన మార్కెట్,ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. సూపర్ హిట్ టాక్ వస్తే,150నుంచి 200కోట్లు కొల్లగొట్టడం ఖాయమని మార్కెట్ వర్గాల అంచనా. ప్రస్తుతం సర్కారువారి పాట మూవీ కమిట్ అయ్యాడు. నందమూరి వంశం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మాస్ మూవీస్ కి పెట్టింది పేరు. కొన్ని సినిమాలు పోవడంతో టెంపర్ మూవీ నుంచి విభిన్న సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నెంబర్ వన్ రేసులో ఉన్నాడు. చిరుత మూవీతో మెగాస్టార్ వారసునిగా ఎంట్రీ ఇచ్చి,మగధీర మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. వరుస సినిమాలు చేస్తూ ఇటీవల రంగస్థలం మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అవార్డుల పంట పండింది. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి గొంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చి స్టైలిష్ స్టార్ గా ఎదిగి నెంబర్ వన్ రేసులో ఉన్నాడు. ఇటీవల సంక్రాంతికి అలవైకుంఠపురంలో మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సినిమా సినిమాకు స్టైల్ మారుస్తూ కొత్త కొత్త స్టెప్స్ తో ఆకట్టుకుంటాడు. ప్రస్తుతం పుష్ప మూవీ చేస్తున్నాడు.