హీరో సిద్ధార్ధ్ కెరీర్ లో ఎన్ని హిట్స్,ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో చూడండి
తమిళం నుంచి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు కొట్టేసిన స్టార్ హీరోల్లో సిద్ధార్ధ్ ఒకడు. ఇప్పటికీ లవర్ బాయ్ గా కనిపించే యితడు హిందీలో కూడా క్లిక్ అయ్యాడు. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సిద్ధార్ధ్ అసోసియేట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి,అనుకోకుండా హీరో అయ్యాడు. సింగర్ గా కూడా మారిన యితడు 1979ఏప్రియల్ 17న జన్మించాడు. తెలుగు ,తమిళం బాగా మాట్లాడే సిద్ధార్ధ్ అచ్చం తెలుగు అబ్బాయిలా ఉంటాడు. మొత్తం అన్నీ కలిపి 34సినిమాలు చేసాడు. అందులో 8భారీ హిట్ అయ్యాయి.
ఇక 9మూవీస్ ఏవరేజ్,సెమి ఏవరేజ్ లు 7, ప్లాప్ లు 4, డిజాస్టర్లు 5ఉన్నాయి. ఒక సినిమా ఎబో ఏవరేజ్. బాయ్స్ సినిమాతో 2003లో సిద్ధార్ధ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సినిమాతో హీరోయిన్ జెనీలియా ఎంట్రీ ఇచ్చింది. 2004లో తమిళంలో మూవీ హిట్ అయింది. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ తెలుగులో స్టైట్ మూవీ చేసి భారీ హిట్ కొట్టాడు. 2006లో చుక్కల్లో చంద్రుడు ప్లాప్. అదే ఏడాది హిందీ మూవీ రంగ్ దే బసంత్ భారీ హిట్ అయింది. 2007లో తెలుగులో వచ్చిన బొమ్మరిల్లు సిద్ధార్ధ్ ని స్టార్ హీరోగా నిలబెట్టింది. తర్వాత ఆట మూవీ ప్లాప్.
ఆతర్వాత వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ హిట్ అయింది. 2009లో వచ్చిన ఓయ్ మూవీ ప్లాప్ అయింది. నటన పరంగా మంచి పేరు వచ్చింది. 2010లో బావ డిజాస్టర్. 2011లో నాలుగు మూవీస్ చేసాడు. 3 తెలుగు,ఒక తమిళం ఉండగా, అనగనగా ఒకరోజు ఇలా అన్నీ ప్లాపయ్యాయి. 2012లో చేసిన రెండు తమిళ మూవీస్ ప్లాప్. తర్వాత సమ్ థింగ్ సమ్ థింగ్, ఎన్ . హెచ్ -4 మూవీస్ వచ్చాయి. ఏవరేజ్. తర్వాత తమిళంలో వచ్చిన మూవీ భారీ హిట్ అయింది. ఆతర్వాత ఎన్నో మంచి సినిమాలు చేసి, సింగర్,యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సిద్ధార్ధ్ ఎంట్రీ ఎప్పుడో చూడాలి.

