Movies

శివాజీ మూవీలో నటించిన ఈ ఇద్దరు గురించి ఈ నిజాలు మీకు తెలుసా ?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ సినిమా సరిగ్గా 13ఏళ్ళక్రితం వచ్చింది. సుమన్ విలన్ గా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అవ్వడంతో రజనీ కి తెలుగులో ఉన్న పాపులారిటీ, క్రేజ్ వలన మంచి హిట్ అందుకుంది. డైరెక్టర్ శంకర్, తీరికెక్కించిన ఈ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ పర్ఫార్మెన్స్ తో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం, వివేక్ కామెడీ టైమింగ్, ఫైట్స్, పంచ్ డైలాగ్స్, సెట్టింగ్స్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి. ఇక సుమన్ విలన్ గా చేయడం హైలెట్. రజనీ ఇందులో నల్లగా ఉంటాడు. శివాజీ సినిమా 2007 లో జాతీయ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డ్ అందుకుంది. ఎందుకంటే ఇందులో రజనీని తెల్లగా చూపించడానికి చాలా కష్టపడ్డారట.

ఈ సినిమాలో రజినీకాంత్ సరసన హీరోయిన్ శ్రియ వేసింది. ఇష్టపడిన విషయం శ్రియకి చెబితే ఆమె ఒప్పుకోదు. అప్పుడు రజనీకాంత్ తన ఫ్యామిలీతో కలసి శ్రియ ఇంటికి వెళ్లి అడుగుతాడు. అయితే తమ ఇంటి దగ్గర నివసించే వ్యక్తికి గల ఇద్దరు కూతుర్లలో ఒకరిని పెళ్లి చేసుకోమని రజనీ కి బదులివ్వడం వింతగా ఉంటుంది. అయితే తన కూతురుని అడగడానికి వస్తే, పక్కింటి అమ్మాయిల గురించి ఎందుకు చెప్పడం ఒక్కొక్కరికి ఒక్కోలా అన్పిస్తుంది. శివాజీ మూవీలో తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి ఈ అక్కా చెల్లెళ్ళకు అక్కమ్మ – జెక్కమ్మ అనే పేర్లు పెట్టారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో 3,4 సీన్స్ లోనే కనిపిస్తారు. అయితే ఈ కేరక్టర్స్ బాగానే ఆకట్టుకున్నాయి. కానీ వీళ్ళ అసలు పేరు ఏంటో ఎవరికీ తెలియదు. కేవలం పిక్చర్స్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తాయి తప్ప, వేరే ఏదైనా సినిమాలో నటించారా? లేదా? అనేది ఎవరికీ ఐడియా లేదు. వీళ్ళ గురించి ఎక్కడా ఎలాంటి ఆచూకీ లేదు

ఇక ఈ సినిమాలో రజనీకాంత్ శ్రియ కోసం తెల్లగా మారతాడు. తెల్లగా ఉన్న శివాజీని శ్రియ చూడంగానే ఒక పాట వస్తుంది. ఆ పాట మొత్తం సి జి (కంప్యూటర్ జనరేటెడ్) లో తీశారట. రంగం, వీడొక్కడే, బందోబస్త్, బ్రదర్స్ సినిమాలు డైరెక్ట్ చేసిన కె.వి. ఆనంద్ సినిమాటోగ్రాఫర్ గా తనపనితనం చూపించాడు. దర్శకుడు శంకర్, ఆనంద్, మేకప్ ఆర్టిస్ట్ భాను,తో పాటు 25 మంది సి జి ఆర్టిస్ట్లు లు పనిచేసారు. జాకీ అనే ఒక ఇంగ్లీష్ డాన్సర్ తో ముందు రజనీకాంత్ పోర్షన్ షూట్ చేశారట. తర్వాత మళ్లీ అదే పోర్షన్ రజినీకాంత్ తో షూట్ చేశారట. జాకీ స్కిన్ రజినీకాంత్ పై డిజిటల్ గ్రాఫ్ట్ చేశారట. జాకీ ఈ పాటలో ఒక మెయిన్ డాన్సర్ గా ఉన్నాడట. ఈ పాటలో మొత్తం 630 షాట్స్ తో 9వేల స్కాన్డ్ ఫ్రేమ్స్ లో కాప్చర్ చేశారట. తర్వాత ఆ ఫ్రేమ్స్ వేరు చేసి రజినీకాంత్ ఫోటో కి తెల్ల చర్మాన్ని సాఫ్ట్ వేర్ ద్వారా మ్యాప్ చేశారట. ఇందుకు దాదాపు ఏడాది పట్టిందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."