నాని ఈ స్థాయికి రావటానికి ఎన్ని అవమానాలు పొందాడో?
నేచురల్ స్టార్ నాని అసోసియేట్ డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనుకోకుండా హీరోగా మారిపోయి ఎన్నో హిట్స్ కొట్టాడు. నేచురల్ స్టార్ అయ్యాడు. ఇక తాజాగా ‘వి’ సినిమాతో నెగెటివ్ షేడ్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి మార్కులు కొట్టేసాడు. నాని కెరీర్ లో ఇది 25వ సినిమా. ఈ మూవీ బాగోలేదన్న టాక్ వచ్చినా నాని వరకూ ఒకే అనే మాట వినిపించింది. కరోనా కారణంగా థియేటర్లు లేకపోవడంతో డైరెక్ట్ ఓటీటీ ద్వారా ఈ సినిమా రిలీజ్ చేసారు.
అంతేకాదు, ప్రస్తుతం టక్ జగదీష్ , శ్యామ్ సింగరాయ సినిమాలతో రెడీ అవుతు న్నాడు. ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా థియేటర్ లలోనే విడుదల అవుతాయి. ఈ రెండు కాకుండా మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్న నాని 50వ సినిమా మైలు రాయి అధిగమిస్తాడని టాక్. ఇక ‘వి’ ఈ మూవీలో నాని నటనకు వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదురైన ఘటనలను వివరిస్తూ ఎమోషన్ అయ్యాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొన్న ట్లు నాని చెప్పాడు.
‘నిజానికి కష్టం లేకుండా పైకి వస్తే కిక్ ఉండదు. కష్టాలు పడి పైకి వచ్చినప్పుడు మాత్రమే కిక్ ఉంటుంది. అందుకే కష్టాలు పడ్డాను. ఎంతో మంది అవమానించినా ఓర్చుకున్నాను. వాటన్నింటికి ప్రతిఫలం నాకు దక్కింది. ప్రస్తుతం నాకు ఉన్నది ఏది కూడా ఈజీగా రాలేదు. ఏదీ కూడా జీవితంలో ఈజీగా రాకూడదు అనేది తన పాలసీ’అని నాని ఎమోషన్ అయ్యాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే నటుడు గా రాణిస్తున్న నాని ఎక్కువ కాలం ఉండక పోవచ్చు అనే మాటలు కూడా వినిపించాయి. అయితే తన ప్రతిభతో పోరాటం చేసి అవమానాలు భరిస్తూ కష్టపడి ఈస్థాయికి వచ్చాడు. అయితే ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడో మాత్రం చెప్పలేదు. దటీజ్ నేచురల్ స్టార్.
