నిద్ర గురించి కొన్ని నమ్మలేని నిజాలు

నిద్ర అనేది మనకు ప్రకృతి ఇచ్చిన వరం. మన దైనందిక జీవితంలో నిద్ర అనేది సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది. నిద్ర సరిగ్గా పట్టకపోతే ఆరోగ్యం పాడవటమే కాకుండా ఆ రోజంతా బద్దకంగా ఉంటుంది. నిద్ర అనేది మనిషిలో అలసటను పోగొట్టి నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. సామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం అవుతుంది. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం. అప్పుడే పుట్టిన పిల్లలకు అయితే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ నిద్ర తగ్గిపోతుంది. పెద్దవారు
అయితే రోజుకి ఎనిమిది గంటల నిద్ర సరిపోతుంది.

నిద్ర మెషిన్స్ శిశువు యొక్క వినికిడి మీద ప్రభావం

టొరంటో ఆసుపత్రి చేసిన ఒక వివాదాస్పద అధ్యయనంలో శిశువులలో వినికిడి నష్టానికి కారణం వైట్ శబ్ద యంత్రాలు అని గుర్తించారు. అయితే ఆ ఫలితాలు నష్టం యొక్క సామర్ధ్యాన్ని మాత్రమే చూపించాయి. పరిశోదకులు యంత్రాలను శిశువుల చెవులకు దగ్గరగా పెట్టటమే కాకుండా సౌండ్ కూడా ఎక్కువగా పెట్టటం వలన ప్రమాదం కలిగిందని కనుగొన్నారు.అయితే సౌండ్ తక్కువ పెట్టి దూరంగా పెడితే కాస్త పరవాలేదని అంటున్నారు పరిశోదకులు.

ఎంత సేపు నిద్ర అవసరం
నిద్ర అనేది ఎక్కువ సమయం ఉండాలా తక్కువ సమయం ఉండాలా అనే విషయంలోకి వస్తే 10 నుంచి 20 నిమిషాల నిద్ర భావాలు లేకుండా చురుకుదనంను కలిగిస్తుంది. అలాగే 90 నుంచి 120 నిమిషాల నిద్ర జడత్వంను తొలగించటమే కాకా మానసిక ప్రాసెసింగ్, చురుకుదనంలో సాయపడుతుంది. నిద్ర పూర్తి చక్రంలో మెదడు
నెమ్మదిగా లోతైన నిద్ర ద్వారా మరొక దశలోకి వెళ్లి కలల లోకంలోకి వెళ్ళుతుంది.

నిద్ర లేకపోవుట వలన ఒత్తిడి కలుగుతుంది
నిద్ర లేకపోవుట వలన అమెరికన్స్ 20 శాతం, జర్మన్లలో ఎనిమిది శాతం, బ్రిటిష్ నివాసితులలో తొమ్మిది శాతం మంది వ్యక్తిగత మరియు ప్రొఫిషనల్ జీవితాల్లో తీవ్రమైన ఆందోళనను ఎదుర్కొన్నారు.

ఎక్కువ సేపు నిద్రలో ఉండుట
ఆరు దేశాలలో చేసిన సర్వే ప్రకారం, ఒక వర్కింగ్ డేలో జపనీస్ పౌరులు ఆరు గంటల మరియు 22 నిమిషాలు నిద్రపోయారు. అదే అమెరికన్లు అయితే జపనీస్ పౌరులు కన్నా తొమ్మిది నిముషాల ముందుగానే నిద్ర లేచారు.

స్పూనింగ్
ఒక అధ్యయనం ప్రకారం 31 శాతం జంటలు అదే దిశలో పడుకుంటారు. అలాగే 42 శాతం మంది జంటలు బ్యాక్ టు బ్యాక్ పడుకుంటారు. 4 శాతం జంటలు మాత్రం ఫేస్ టు ఫేస్ పడుకోవటానికి ఆసక్తి చూపుతారని తెలిసింది.

జంటలు దగ్గరగా కలిసి నిద్రిస్తే
ఇటీవల ఎడిన్బర్గ్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో 1,000 మంది జంటలను వారు నిద్రించే స్థానాలు మరియు వారి
సంబందాల గురించి అడిగారు. వారు చెప్పిన సమాధానాలను బట్టి దూరంగా నిద్రించిన జంటల సంబంధం కంటే దగ్గరగా నిద్రించిన జంటల మధ్య సంబందాలు బాగా ఉన్నట్టు కనుగొన్నారు.

మద్యం నిద్రకు సాయం చేయదు
మద్యం త్రాగితే సులభంగా నిద్ర వస్తుందని అందరు అనుకుంటారు. కానీ పరిశోధకులు మాత్రం మధ్య రాత్రిలో మెలుకవ వస్తుందని, అసహనము, చెమటలు మరియు బాత్రూమ్ కి ఎక్కువ సార్లు వెళ్ళవలసి రావటం వంటి
సమస్యలు వస్తాయని కనుగొన్నారు.

మీ నాలుక పెద్దదా? చిన్నదా?
2014 లో చేసిన పరిశోదన ప్రకారం లావుపాటి పురుషులు సాదారణ స్థాయిలో నిద్రపోయే వారి నాలుక పెద్దదిగా ఉంటుందని, అలాగే నాలుక బేస్ వద్ద మరింత కొవ్వు కలిగి ఉండటం గమనించారు. అంతేకాక ఇటువంటి వారి వాయు ద్వారాలు కూడా అడ్డుకుంటాయని తెలిసింది.

బాగా లేట్ గా పడుకుంటే
2013 లో, మాడ్రిడ్ మనస్తత్వవేత్తలు చేసిన పరిశోదనలో బాగా లేట్ గా పడుకొని ఉదయం బాగా లేట్ గా లేచిన వారి కంటే ఉదయం తొందరగా లేచిన వారిలో తెలివితేటలు ఎక్కువ అని తేలింది.

కెనడియన్ పెద్దలలో 40 శాతం నిద్రలేమి
ఒక పరిశోదన ప్రకారం,వారు అనుకున్న దాని కన్నా అరగంట ముందుగా లేవటం, అలాగే రాత్రి సమయంలో అరగంట కన్నా ఎక్కువగా లేట్ గా పడుకోవటం వలన వారిలో నిద్రలేమి లక్షణాలు కనపడ్డాయని కనుగొన్నారు.

నిద్ర లేకపోవుట వలన నిద్రలేమి సమస్య
నిద్రలేమి సూచనలు ఉదయం లేచినప్పటి నుండి కనపడతాయి. ఉదయం పూట చిరాకుగా ఉండటం , నిరాశ, తలనొప్పి మరియు జీర్ణశయ బాధ, విశ్రాంతి లేని ఫీలింగ్వం టి లక్షణాలు ఉంటాయి.

నిద్ర లేకపోవుట వలన మెదడుకు మనోవైకల్యం
గత సంవత్సరం జర్మనీ బాన్ విశ్వవిద్యాలయంలో పరిశోదకులు 24 గంటల పాటు పడుకొని ఉన్న వ్యక్తులపై పరిశోదన చేసి వారిలో స్కిజోఫ్రెనియా (మెదడుకు మనోవైకల్యం) లక్షణాలను కనుగొన్నారు. అంతేకాక ఉచ్చరించడంలో లోపాలు,దృష్టి లోపాలు,భ్రాంతులు మరియు సమయం తెలియకపోవటం,వాసన గుర్తు పట్టలేకపోవటం వంటివి ఉంటాయని కనుగొన్నారు.

సాక్స్ వేసుకుంటే మంచి నిద్ర
కెనడియన్స్ కన్నా అమెరికన్లు, జర్మన్లు, జపనీస్, బ్రిటిష్ మరియు మెక్సికన్స్ సాక్స్ తో పడుకుంటే మంచి నిద్ర పడుతుందని వారు భావిస్తారు. చేతులు మరియు పాదాలు వెచ్చగా ఉండుట వలన నిద్ర త్వరగా పడుతుందని వారు
చెప్పారు. అంతేకాక శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణ ఉండుట వలన మంచి నిద్ర పడుతుందని వారి భావన.

నిద్రకు ఊబకాయంనకు సంబంధం
2010 లో క్లినికల్ న్యూట్రిషన్ అమెరికన్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనంలో ఎనిమిది గంటలు పడుకున్న వారిలో కన్నా నాలుగు గంటలు పడుకున్న వారిలో అదనపు కేలరీలు ఖర్చు అయినట్టు కనుగొన్నారు. అలాగే తక్కువ సమయం పడుకున్న వారిలో ఆకలి కూడా ఎక్కువగా ఉండుట వలన ఎక్కువ ఆహారాన్ని అందించారు. ఇంకా అలసిన గ్రూప్ తదుపరి భోజనం సమయంలో చాల ఎక్కువ కేలరీలు సేవించింది.