Kitchen

కూరగాయలతో పరోటా చేసుకుందామా

కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి – రెండున్నర కప్పులు, పనీర్‌ – 100 గ్రాములు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా, బంగాళదుంపలు – రెండు, క్యారెట్‌ – ఒకటి, క్యాలీఫ్లవర్‌ – ఒకటి(చిన్నది), బీన్స్‌ – ఐదారు, పచ్చి బఠాణీ – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – అర టీస్పూన్‌, పచ్చిమిర్చి – రెండు, గరంమసాలా – అర టీస్పూన్‌, జీలకర్రపొడి – అర టీస్పూన్‌, మామిడికాయ పొడి – అర టీస్పూన్‌, దంచిన ధనియాలు – ఒక టీస్పూన్‌, ఇంగువ – చిటికెడు, కొత్తిమీర – ఒకకట్ట.

తయారుచేసే విధానం
ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని దానిలో కొంచెం నూనె సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోస్తూ గట్టిగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి దీనికి కాస్త నూనె రాసి అరగంట పక్కన పెట్టాలి. బంగాళదుంపను శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అలాగే బీన్స్ కాలీఫ్లవర్ క్యారెట్ లను కూడా కట్ చేయాలి కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలను బఠాణీలను కలిపి కుక్కర్లో ఉడికించాలి మెత్తగా ఉడికాక స్మాష్ చేయాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి కాస్త నూనె వేసి వేడెక్కాక పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి ఆ తర్వాత ధనియాల పొడి గరంమసాలా జీలకర్ర పొడి ఇంగువ వేసి కలపాలి కొంచెం సన్నగా తరిగిన పనీర్ను వేసి కలపాలి

ఒక నిమిషం వేడిచేసి ఉడికించి స్మాష్ చేసిన కూర ముద్దను వేసి కొంచెం ఉప్పు వేసి కలపాలి రెండు నిమిషాల పాటు వేగించి కొత్తిమీర జల్లి పొయ్యి మీద నుంచి కిందకు దింపాలి. పిండి ముద్దను కొంచెం తీసుకొని చపాతీ మాదిరిగా ఒత్తుకుని దానిలో కూరగాయలతో తయారు చేసుకున్న ముద్ద పెట్టి నాలుగువైపులా చపాతీ లా దగ్గరికి తీసుకుని మూసి చపాతీ కర్రతో చపాతీలా ఒత్తుకోవాలి. వీటిని నూనె వేస్తూ కాల్చుకుంటే మిక్సిడ్ విజిటేబుల్ పరాటా రెడీ.